న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బుమ్రా నోబాల్ నాకు కొత్త జీవితాన్నిచ్చింది'

'Jasprit Bumrah No-Ball In Champions Trophy Final Made Me' Says Fakhar Zaman || Oneindia Telugu
Jasprit Bumrah’s no-ball in the Champions Trophy final made me: Fakhar Zaman

హైదరాబాద్: టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన తప్పిదమే తాను క్రికెటర్‌గా నిలదొక్కకునేందుకు ఉపయోగపడిందని పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఫకార్ జమాన్ వెల్లడించాడు. 2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఫకార్ జమాన్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ టోర్నీ పైనల్లో ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. పైనల్లో ఫకార్ జమాన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఆ బంతి నోబాల్‌ కావడం... అతడికి లైఫ్ రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్న జమాన్ అనంతరం చెలరేగిపోయాడు.

పాకిస్థాన్ విజయంలో కీలకపాత్ర

పాకిస్థాన్ విజయంలో కీలకపాత్ర

అంతేకాదు ఈ మ్యాచ్‌లో కెరీర్‌లో తొలి సెంచరీని సాధించి పాకిస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌లో భారత్ 180 పరుగుల తేడాతో ఓడగా, సర్ఫరాజ్ నాయకత్వంలోని పాకిస్థాన్ తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఫకార్‌ జమాన్‌ 106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 114 పరుగులు చేశాడు.

50 ఓవర్లలో 338 పరుగులు చేసిన పాక్

50 ఓవర్లలో 338 పరుగులు చేసిన పాక్

దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ బౌలర్లు చేలరేగడంతో కోహ్లీసేన 30.3 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. తాజాగా బుమ్రా నో బాల్ గురించి ఫకార్ జమాన్ హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో స్పందించాడు.

బుమ్రా నోబాల్ నాకు కొత్త జీవితాన్నిచ్చింది

బుమ్రా నోబాల్ నాకు కొత్త జీవితాన్నిచ్చింది

"బుమ్రా నోబాల్ నాకు కొత్త జీవితాన్నిచ్చింది. ఆ ఫైనల్‌కి ముందు వరకూ నాకు నోబాల్‌‌‌లో ఔటవ్వాలనే డ్రీమ్ ఉండేది. అనూహ్యంగా అది నిజమైంది. భారత్‌పై మ్యాచ్‌లో బాగా ఆడతానని నా తల్లిదండ్రులకి అప్పటికే ప్రామిస్ చేశాను. ఫైనల్లో తొలుత ఔట్‌ కాగానే చాలా బాధనిపించింది. అయితే అది నో బాల్‌ కావడంతో సెంచరీ చేశాను" అని ఫకార్ జమాన్ అన్నాడు.

బాగా ఫేమస్ అయిపోయా

బాగా ఫేమస్ అయిపోయా

"భారత్‌పై సెంచరీ తర్వాత నేను బాగా ఫేమస్ అయిపోయాను. కానీ పేరు ప్రఖ్యాతలతో పాటు బాధ్యత కూడా పెరిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిణతితో క్రికెట్ ఆడుతున్నా. ఇప్పుడు నా లక్ష్యం వరల్డ్‌కప్‌లో అత్యుత్తమంగా ఆడటమే" అని ఫకార్ జమాన్ తెలిపాడు. పాక్ తరుపున ఫకార్ జమాన్ 36 వన్డేలాడి 1642 పరుగులు చేశాడు.

ఫకార్ జమాన్ డబుల్ సెంచరీ

ఫకార్ జమాన్ డబుల్ సెంచరీ

గతేడాది జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫకార్ జమాన్ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. తద్వారా డబుల్ సెంచరీ సాధించిన తొలి పాకిస్థాన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్ కప్‌లో దాయాది దేశాల మధ్య మ్యాచ్ జూన్ 16న జరగనుంది.

Story first published: Monday, May 27, 2019, 18:01 [IST]
Other articles published on May 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X