న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రాకు జాలి, దయ ఉండవు.. సహచరులను కూడా వదిలిపెట్టడు!!

Jasprit Bumrah bowls the ball at serious speeds, he’s a competitor off the field says KL Rahul

ఢిల్లీ: భారత స్టార్ పేసర్, యార్కర్ కింగ్ జస్ప్రీత్‌ బుమ్రాకు జాలి, దయ ఉండవు. ఆఫ్‌ఫీల్డ్‌లో సహచరులను కూడా వదిలిపెట్టడు అని మరో భారత బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ పేర్కొన్నాడు. బుమ్రాను ఏ బ్యాట్స్‌మన్‌ గందరగోళానికి గురిచేయలేడు. ఎందుకంటే.. అతను బంతిని తీవ్రమైన వేగంతో విసురుతాడు అని తెలిపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బుమ్రా, రాహుల్ ఆడట్లేదు. గాయంతో బుమ్రా సిరీస్‌కు దూరమవగా.. ఫామ్ కారణంగా రాహుల్ ఎంపిక కాలేదు.

<strong>IND vs SA: పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్ల రికార్డును బద్దలు కొట్టిన భారత్‌-దక్షిణాఫ్రికా!!</strong>IND vs SA: పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్ల రికార్డును బద్దలు కొట్టిన భారత్‌-దక్షిణాఫ్రికా!!

జాలి, దయ ఉండవు

జాలి, దయ ఉండవు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రాహుల్ మాట్లాడుతూ... 'బుమ్రాను ఏ బ్యాట్స్‌మన్‌ గందరగోళానికి గురిచేయలేడు. ఎందుకంటే.. అతను బంతిని తీవ్రమైన వేగంతో విసురుతాడు. బుమ్రాకు జాలి, దయ ఉండవు. ఆఫ్‌ఫీల్డ్‌లో సహచరులను కూడా వదిలిపెట్టడు. ఎప్పుడూ పోటీపడి ఆడతాడు. భారత జట్టుకు బుమ్రా అందిస్తున్న సేవలు అద్భుతం. భవిష్యత్‌లో మరింతగా రాణిస్తాడనే నమ్మకం ఉంది' అని తెలిపాడు.

బుమ్రా అత్యుత్తమ బౌలర్:

బుమ్రా అత్యుత్తమ బౌలర్:

'ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో ఆసీస్‌ ఆటగాడు పాట్‌ కమిన్స్‌ అత్యుత్తమ బౌలర్‌. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం. అలాగే రషీద్‌ ఖాన్‌ నాపై ఎప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తాడు. అతడి బౌలింగ్‌లో ఔటయ్యాను. నాథన్‌ లయన్‌ కూడా బాగా బౌలింగ్ చేస్తాడు. వీరిని ఎదుర్కోవడం నాకు చాలా కష్టం. ఈ ముగ్గురితో పాటు బుమ్రా కూడా అత్యుత్తమ బౌలర్‌' అని రాహుల్‌ అన్నాడు.

మా జట్టులో ఉండాలని కోరుకుంటా:

మా జట్టులో ఉండాలని కోరుకుంటా:

'ఇంగ్లాండ్‌ స్టార్ ప్లేయర్‌, ప్రపంచకప్ హీరో బెన్‌ స్టోక్స్‌ని ఐపీఎల్‌లో పంజాబ్‌ జట్టులోకి తీసుకోవడానికి ఇష్టమే. స్టోక్స్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ బాగా చేస్తాడు. బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అవసరానికి తగినట్టు ఆడతాడు. అతడు ఆడిన జట్లు అన్నింటిపై మంచి ప్రదర్శన చేశాడు. కాబట్టి అతడు మా జట్టులో ఉండాలని కోరుకుంటా' అని రాహుల్‌ పేర్కొన్నాడు.

ఇప్పట్లో రాహుల్‌కు అవకాశం కష్టమే:

ఇప్పట్లో రాహుల్‌కు అవకాశం కష్టమే:

భారత జట్టులో చోటు కోల్పోవడంతో కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం కర్ణాటక జట్టు తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో రాహుల్‌ అదరగొట్టాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసాడు. అయితే రాహుల్‌ స్థానంలో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న రోహిత్‌ శర్మ తొలి టెస్టులోనే సత్తాచాటాడు. వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసాడు. మరోవైపు మయాంక్ అగర్వాల్ కూడా డబుల్ సెంచరీ చేయడంతో ఇప్పట్లో రాహుల్‌కు అవకాశం రావడం కష్టమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Story first published: Sunday, October 6, 2019, 19:12 [IST]
Other articles published on Oct 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X