న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌కు దెబ్బపడేదే! రాయ్‌కు జరిమానా, ఫైనల్ నిషేధం తొలగింపు!

Jason Roy Fined For Breaching Code Of Conduct, Avoids Ban For World Cup Final

హైదరాబాద్: నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఇంగ్లాండ్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జ‌రిమానా విధించింది. టోర్నీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అంఫైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన జేసన్ రాయ్

అంఫైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన జేసన్ రాయ్

ఈ మ్యాచ్‌లో అంపైర్ ఔట్ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డాన్ని జేసన్ రాయ్ త‌ప్పుప‌ట్టాడు. అంతేకాదు అంఫైర్ కుమార ధ‌ర్మ‌సేన‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఐసీసీ నియ‌మావ‌ళిని ఆర్టిక‌ల్ 2.8 ఉల్లంఘ‌న ప్ర‌కారం అతడిపై ఐసీసీ చ‌ర్య‌లు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది.

రెండు డీమెరిట్ పాయింట్లు సైతం

రెండు డీమెరిట్ పాయింట్లు సైతం

దీంతో పాటు అతడి ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లను కూడా జత చేసింది. దీంతో వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ కావడంతో అతడిపై నిషేధాన్ని తప్పించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు.

ప్యాట్ క‌మ్మిన్స్ బౌలింగ్‌లో

ప్యాట్ క‌మ్మిన్స్ బౌలింగ్‌లో

ప్యాట్ క‌మ్మిన్స్ వేసిన మ్యాచ్ 20వ ఓవ‌ర్‌లో రాయ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. టీవీ రిప్లేలో మాత్రం బంతి.. బ్యాట్‌కు తాక‌లేద‌ని స్ప‌ష్టంగా కనిపించింది. అంపైర్ మాత్రం రాయ్‌ను ఔట్ చేస్తూ నిర్ణ‌యం ప్ర‌క‌టించాడు. ఆ స‌మ‌యంలో అంపైర్‌తో రాయ్ వాగ్వాదానికి దిగాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసేందుకు గాను 50 బంతులు తీసుకున్న జేసన్ రాయ్ ఆ తర్వాత 15 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు.

65 బంతుల్లో 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా

65 బంతుల్లో 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా

దీంతో మొత్తం 65 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జేసన్ రాయ్ ఔటైన త‌ర్వాత ఇయాన్ మోర్గ‌ాన్(45 నాటౌట్), జో రూట్‌(49 నాటౌట్) రాణించి ఇంగ్లాండ్‌ను ఫైనల్‌కు చేర్చింది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 44 ఏళ్ల తర్వాత తమ టైటిల్‌ కలను నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది.

Story first published: Friday, July 12, 2019, 14:13 [IST]
Other articles published on Jul 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X