న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నాకే ఇబ్బందిగా ఉంది.. మరోసారి ఇలాంటి పని చేయను'

It was just an absolute car crash - Root regrets bat-drop celebration

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా రెండు సిరీస్‌లను ఆడి ఒక దాంట్లో గెలిచి మరొకటి ఓడిపోయింది. ఈ క్రమంలో ఆఖరి వన్డే నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ ఏ విభాగంలోనూ ధాటిగా రాణించకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని ఎగరేసుకుపోయింది. మ్యాచ్ మొత్తంలో .. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జోయ్ రూట్ పాత్ర కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసిన జోయ్ రూట్ బ్యాట్‌ను నేల మీదకు జారవిడిచి సంబరాలు చేసుకున్నాడు. తాజాగా ఈ విషయంపై క్రీడా ప్రపంచమంతటా.. అతనిపై చర్చ మొదలైంది.

బ్యాట్ డ్రాప్ మరోసారి రిపీట్ చేయనని

హెడింగ్లే వన్డే సెంచరీ హీరో జో రూట్.. బ్యాట్ డ్రాప్ మరోసారి రిపీట్ చేయనని అన్నాడు. భారత్‌తో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో ఇంగ్లాండ్ జట్టు సిరీస్ విజయంలో రూట్ కీలక పాత్ర పోషించాడు.257 పరుగుల లక్ష్య చేధనలో బాధ్యతాయుతంగా ఆడి సెంచరీతో ఇంగ్లండ్‌ను సిరీస్ విజేతగా నిలిపాడు. విన్నింగ్ షాట్‌తోనే సెంచరీ పూర్తి చేసి.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పిచ్‌పై బ్యాట్‌ను వదిలేసి సంబరాలు జరుపుకున్నాడు.

ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌‌తో పాటు క్రికెట్ అభిమానులందరికీ

ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌‌తో పాటు క్రికెట్ అభిమానులందరికీ

ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు క్రికెట్ అభిమానులందరికీ రూట్ సంబరాలు జరుపుకున్న విధానం బాగా నచ్చేసింది. రూట్ బ్యాట్‌ను పడేసి జరుపుకున్న సంబరాలకు 'బ్యాట్ డ్రాప్' సెలబ్రేషన్స్‌ అంటూ అభిమానులు పేరు పెట్టారు. దీంతో బ్యాట్‌ను జారవిడిచి జరుపుకున్న సంబరాలు తనను ఎంతగానో ఇబ్బందిపెట్టాయని రూట్ భావిస్తున్నాడు.

మైదానంలో చేసిన ఇబ్బందికర పని.

తాను చేసిన పని తనకే నచ్చలేదని ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ అభిప్రాయపడ్డాడు. 'బ్యాట్ డ్రాప్ సెలబ్రేషన్స్‌ జరుపుకున్న వెంటనే చింతించాను. ఇది క్రికెట్ మైదానంలో చేసిన ఇబ్బందికర పని. ఇటువంటి పనిని మరోసారి పునరావృతం చేయను.' అని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు.

బ్యాట్‌ డ్రాప్'సెలబ్రేషన్స్‌‌ను

క్రికెట్‌కు 'బ్యాట్‌ డ్రాప్'సెలబ్రేషన్స్‌‌ను పరిచయం చేసిన ఆటగాడిగా జో రూట్‌ను అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. బ్యాట్ డ్రాప్‌ సంబరాలపై రూట్ అభిప్రాయం ఎలా ఉన్నా.. మిగతా క్రికెటర్లు ఖచ్చితంగా ఇదే విధంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Story first published: Thursday, July 19, 2018, 12:34 [IST]
Other articles published on Jul 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X