నవంబర్ 23న భువీ పెళ్లి, 30న ఢిల్లీలో టీమిండియాకు విందు

Posted By:

హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి నుపుర్ నగార్‌ను నవంబర్ 23న పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. మీరట్‌లోని ఓ రిసార్ట్‌లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగనుంది.

30న ఢిల్లీలో టీమిండియాకు విందు

30న ఢిల్లీలో టీమిండియాకు విందు

పెళ్లి అనంతరం నవంబర్ 26న బులంద్‌షెహర్‌లో, 30న ఢిల్లీలో రెండు రిసెప్షన్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరిగే విందు కార్యక్రమానికి భారత క్రికెట్‌ జట్టు సభ్యులు హాజరయ్యే అవకాశముంది. అక్టోబర్ 4వ తేదీన ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నోయిడాలో భువీ-నగార్‌ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

భువీ, నుపుర్ చిన్నప్పటి నుంచే స్నేహితులు

భువీ, నుపుర్ చిన్నప్పటి నుంచే స్నేహితులు

భువీ, నుపుర్ చిన్నప్పటి నుంచే స్నేహితులు. వీళ్ల కుటుంబాలు మీరట్‌లోని గంగానగర్‌లో ఇరుగు పొరుగున నివాసం ఉండేవి. దీంతో ఎప్పటి నుంచో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. దీనికి తోడు భువీ తండ్రి కిరణ్‌పాల్ సింగ్, నుపుర్ తండ్రి యశ్‌పాల్ సింగ్.. ఇద్దరూ ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు.

ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతోనే

ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతోనే

దీంతో భువీ, నుపుర్‌ల ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే నిశ్చితార్థం వరకు తన జీవిత భాగస్వామి వివరాలను దాచి పెట్టడంలో భువీ సక్సెస్ అయ్యాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగే సమయంలో ఓ రెస్టారెంట్లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కూర్చుని దిగిన ఫొటోలో తాను మాత్రమే కనిపించేటట్టు ‘డిన్నర్‌ డేట్‌.. త్వరలో పూర్తి ఫొటో విడుదల చేస్తా' అని భువీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు.

హీరోయిన్ అంటూ అప్పట్లో ప్రచారం

హీరోయిన్ అంటూ అప్పట్లో ప్రచారం

దీంతో ఆ డేట్‌ ఫొటోలో ఉన్నది ఒకప్పటి హీరోయిన్ అంటూ అప్పట్లో ప్రచారం సాగింది. అయితే వీటిపై స్పందించిన భువీ ఆ వార్తలను ఖండించి 'ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఇలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి. సమయం వచ్చినప్పుడు ఆమె ఎవరన్నది నేనే చెప్తాను' అని పేర్కొన్నాడు. ఆ తర్వాత బుధవారం హఠాత్తుగా భువీ తన భాగస్వామి ఎవరో అభిమానులకు చూపించాడు. తన ట్విటర్‌లో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో ఉంచి ‘ఇదిగో మిగిలిన సగం ఫొటో నుపుర్ నగార్‌తో' అని భువీ తెలిపాడు.

Story first published: Tuesday, October 10, 2017, 13:17 [IST]
Other articles published on Oct 10, 2017
Please Wait while comments are loading...
POLLS