న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎన్‌సీఏలో 29న ఇషాంత్, అశ్విన్‌కు ఫిట్‌నెస్ పరీక్ష

Asia Cup 2018 : Ishant And Ashwin To Undergo Fitness Test On September 29
Ishant, Ashwin to take fitness test on September 29 before selectors pick Test squad against WI

హైదరాబాద్: అక్టోబర్ 4 నుంచి వెస్టిండిస్ జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం సెలక్టర్లు భారత జట్టుని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, ఈ టెస్టు సిరిస్ ఎంపికలో భాగంగా టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మతో పాటు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెప్టెంబర్ 29న ఫిట్‌నెస్ పరీక్ష ఎదుర్కొబోతున్నారు.

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడ్డ అశ్విన్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. త్వరలోనే ఇషాంత్, అశ్విన్‌తో జత కలిసే అవకాశముంది.

ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తోన్న అశ్విన్

ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తోన్న అశ్విన్

ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ "అశ్విన్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలోని పునరావాస కేంద్రంలో ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్నాడు. ఇషాంత్ కూడా త్వరలో అతడితో జతకలిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న ఈ ఇద్దరికీ ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహించనున్నాం. ఫిట్‌నెస్ టెస్టు అనంతరం సెలక్టర్లు ఎన్‌సీఏలోని ఫిజియోలు, ట్రైనర్స్‌ను సంప్రదించనున్నారు" అని అన్నారు.

 అశ్విన్ విఫలమైతే చాహల్‌ను తీసుకునే అవకాశం

అశ్విన్ విఫలమైతే చాహల్‌ను తీసుకునే అవకాశం

నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని వెస్టిండిస్‌తో టెస్టు సిరిస్‌కు జట్టును ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది. ఒక వేళ ఫిట్‌నెస్ టెస్ట్‌లో అశ్విన్ విఫలమైతే మణికట్టు స్పిన్నర్ చాహల్‌ను తీసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 4 నుంచి వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం బుధవారమే జట్టును ప్రకటించాల్సి ఉంది.

ప్రాథమికంగా ఓ జాబితా సిద్ధం

ప్రాథమికంగా ఓ జాబితా సిద్ధం

అయితే, సెలెక్టర్లు అందుబాటులో లేని కారణంగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ కలిసి ప్రాథమికంగా ఓ జాబితాను సిద్ధం చేశారు. నిజానికి బుధవారం వెస్టిండిస్ సిరీస్ కోసం ఎంపిక ప్రక్రియ ఎజెండాలో ఉన్నప్పటికీ, కొంత మంది సెలెక్టర్ల గైర్హాజరీతో రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

 ధావన్‌పై పాజిటివ్‌గానే

ధావన్‌పై పాజిటివ్‌గానే

ఇంగ్లాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్‌ను వెస్టిండిస్‌తో జరగనున్న రెండు టెస్టులకు కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో ధావన్ సూపర్ ఫామ్‌లో ఉండటమే ఇందుకు కారణం. మరో ఓపెనర్‌‌గా పృథ్వీ షా లేదా మయాంక అగర్వాల్‌లలో ఎవరో ఒకరిని పరీక్షించే అవకాశం ఉంది.

Story first published: Thursday, September 27, 2018, 10:29 [IST]
Other articles published on Sep 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X