న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కీపింగ్‌లో ధోనీ వేగాన్నందుకున్న ఇషాన్ కిషన్ (వీడియో)

Ishan Kishan does a perfect MS Dhoni during Vijay Hazare match, almost pulls off a run out

న్యూ ఢిల్లీ: ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రశాంతంగా కనిపిస్తూ.. కీపింగ్‌లో ఏ మాత్రం తడబాటు కనిపించకుండా ఆడటం ధోనీని స్టైల్. అలా బంతిని వికెట్లపైకి గురి తప్పకుండా విసరడంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీది అందెవేసిన చేయి. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నోసార్లు కనీసం వికెట్ల వైపు చూడకుండానే ధోనీ రనౌట్ చేసిన సందర్భాలు బోలెడు కనిపిస్తాయి.

బంతిని చూడకుండానే వికెట్లపైకి విసిరి:

బంతిని చూడకుండానే వికెట్లపైకి విసిరి:

తాజాగా ఓ దేశీవాలీ ట్రోఫీలో ధోనీని తలపించే విధంగా జార్ఖండ్ యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ బంతిని వికెట్లపైకి విసిరి తన ఆరాధ్య క్రికెటర్‌ని తలపించాడు. ఇషాన్ కిషన్ కూడా జార్ఖండ్‌ నుంచే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

బంతి క్రీజు సమీపంలో పడటంతో

బంతి క్రీజు సమీపంలో పడటంతో

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ ఈ మెరుపు ప్రదర్శన కనబర్చాడు. ఇన్నింగ్స్‌ 28వ ఓవర్ వేసిన స్పిన్నర్ నదీమ్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ ఆడేందుకు మహారాష్ట్ర బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి క్రీజు సమీపంలో పడటంతో.. వేగంగా సింగిల్ తీసేందుకు త్రిపాఠి ట్రై చేశాడు.

రనౌట్ ప్రమాదాన్ని గ్రహించిన త్రిపాఠి

కానీ.. వేగంగా బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ వెనక్కి తిరిగి చూడకుండానే వికెట్లపైకి బంతి విసిరాడు. అయితే.. రనౌట్ ప్రమాదాన్ని గ్రహించిన త్రిపాఠి అప్పటికే క్రీజులోకి వచ్చేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు.. ఇషాన్ కిషన్ బంతిని విసిరిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

8 వికెట్ల తేడాతో గెలుపొందిన జార్ఖండ్

8 వికెట్ల తేడాతో గెలుపొందిన జార్ఖండ్

వాస్తవానికి ఈ మ్యాచ్‌లో మహేంద్రసింగ్ ధోనీ ఆడాల్సింది. ఈ మేరకు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటన కూడా చేశాడు. కానీ.. తాను ఆడితే ఓ యువ క్రికెటర్ జట్టులో స్థానం కోల్పోవాల్సి వస్తుందని పక్కకి తప్పుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన జార్ఖండ్ .. గురువారం ఢిల్లీతో సెమీఫైనల్లో తలపడనుంది.

Story first published: Tuesday, October 16, 2018, 12:39 [IST]
Other articles published on Oct 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X