న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: జస్ప్రీత్ బుమ్రా.. 'బ్రేక్‌ త్రూ యాప్‌' లాంటివాడు! కావాల్సినప్పుడు వాడుకోవచ్చు!

Irfan Pathan says Jasprit Bumrah is like a breakthrough app

ఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్‌, యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. బంతి ఎప్పుడు చేతికిచ్చినా.. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే బుమ్రాను 'బ్రేక్‌ త్రూ యాప్‌'తో ఇర్పాన్‌ పోల్చాడు. బుమ్రా డిఫరెంట్‌ యాక్షన్‌ బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా ఉంటుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ పేర్కొన్నాడు. అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటినుంచి ఫార్మాట్ ఏదైనా బూమ్ బూమ్ బుమ్రా చెలరేగుతున్నాడు. అంతేకాదు కెరీర్ ఆరంభం నుంచి ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ ఎన్నో విజయాలు అందించాడు.

IPL 2021: 'వ్యక్తిగత స్కోరు గురించి ఆలోచించను.. జట్టు విజయమే నాకు ముఖ్యం'IPL 2021: 'వ్యక్తిగత స్కోరు గురించి ఆలోచించను.. జట్టు విజయమే నాకు ముఖ్యం'

15 పరుగులు మాత్రమే:

15 పరుగులు మాత్రమే:

జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2021లో కూడా మెరుస్తున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ సునాయాసంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. బుమ్రా నాలుగు ఓవర్లు వేసి వికెట్‌ తీయడమే కాకుండా.. 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం ఓ క్రికెట్ షోలో మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, బ్రెట్‌ లీలు బుమ్రా బౌలింగ్‌ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగానే ఇద్దరూ అతడిపై ప్రశంసలు కురిపించారు. 27 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు టీమిండియా తరఫున 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.

బ్రేక్‌ త్రూ యాప్‌ లాంటివాడు:

బ్రేక్‌ త్రూ యాప్‌ లాంటివాడు:

'జస్ప్రీత్ బుమ్రా సూపర్ బౌలర్. కెరీర్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. అద్భుత బంతులు విసురుతున్నాడు. బుమ్రా.. 'బ్రేక్‌ త్రూ యాప్‌' లాంటివాడు. నీకు వికెట్‌ కావాలనుకుంటే బుమ్రా యాప్‌ను ఓపెన్‌ చేస్తావ్‌. అలాగే పరుగులు కట్టడి చేయాలన్నా.. బుమ్రానే. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో కూడా అదే చూశాం. ముంబై ఇండియన్స్‌కు బుమ్రా ఆడుతున్న తొలి ఐపీఎల్‌ నుంచి అతనే అదే చేస్తూ వస్తున్నాడు' అని ఇర్ఫాన్‌ పఠాన్ కొనియాడాడు.

అందుకే అసాధారణ బౌలర్‌:

అందుకే అసాధారణ బౌలర్‌:

'జస్ప్రీత్ బుమ్రా క్లాస్‌, ఫైర్‌ పవర్‌ ఉన్న బౌలర్‌. అతని డిఫరెంట్‌ యాక్షన్‌ బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టంగా ఉంటుంది. అతను వేసే లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బాల్స్‌ అన్నీ కచ్చితత్వంతో వేస్తాడు. అందుకే అసాధారణ బౌలర్‌ అయ్యాడు. బుమ్రా చేసేది మిగతా చాలా మంది బౌలర్లు చేయలేకపోతున్నారు. అతను వేసే యార్కర్లకు అసలు తిరుగే ఉండదు' అని ఐపీఎల్‌ బ్రాడ్‌ కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడిన బ్రెట్‌ లీ చెప్పుకొచ్చాడు. రెండు వరుస పరాజయాల తర్వాత డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాజస్థాన్‌ను చిత్తుచేసి గాడిలో పడింది.

వరుస పరాజయాలకు చెక్:

వరుస పరాజయాలకు చెక్:

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (27 బంతుల్లో 42; 5ఫోర్లు), జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 41; 3ఫోర్లు, 3సిక్స్‌లు) రాణించారు. ముంబై బౌలర్లలో రాహుల్‌ చహర్‌ రెండు వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (50 బంతుల్లో 70 నాటౌట్‌; 6ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ శతకంతో అదరగొట్టడంతో ముంబై 18.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 172 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Story first published: Friday, April 30, 2021, 17:23 [IST]
Other articles published on Apr 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X