న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డికాక్‌ తప్పిదం వల్ల బైస్‌: ఐపీఎల్ ఫైనల్‌లో నిజమైన హీరో బుమ్రానే

IPL 2019 : Jasprit Bumrah’s Perfection Shines Through In IPL Final || Oneindia Telugu
IPL Final, MI vs CSK: Jasprit Bumrah wins hearts with his gesture after Quinton de Kock’s miss almost cost MI the title

హైదరాబాద్: గ్రేట్ ఫిజిక్, దూకుడు, స్పీడ్, కంట్రోల్, స్వింగ్, విభిన్నం... ఇలాంటి అన్ని క్వాలిటీస్ ఉన్న పేస్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చేది జస్ప్రీత్ బుమ్రా. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి టైటిల్‌ను అందుకుని చరిత్ర సృష్టంచింది. అయితే, ముంబై విజయం వెనుక ప్రధానంగా వినిపిస్తోన్న పేరు జస్ప్రీత్ బుమ్రా. ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన మలింగ ముంబయికి హీరోగా నిలిచాడు కానీ.. అంతకుముందు ఆ జట్టును పోటీలో నిలబెట్టింది మాత్రం బుమ్రానే.

4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 14 పరుగులు

4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 14 పరుగులు

ఫైనల్ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన బుమ్రా 2 వికెట్లు తీసి 14 పరుగులు ఇచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతం. మలింగ వేసిన 16వ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్లు వాట్సన్, బ్రావోలు దూకుడుగా ఆడి 20 పరుగులు రాబట్టారు.

బుమ్రా ఇచ్చింది కేవలం నాలుగు పరుగులే

బుమ్రా ఇచ్చింది కేవలం నాలుగు పరుగులే

అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా కేవలం నాలుగే పరుగులిచ్చి ముంబైని పోటీలో నిలబెట్టాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 20 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో చెన్నై విజయ సమీకరణం 2 ఓవర్లలో 18 పరుగులుగా మారింది. ఆ తర్వాత మళ్లీ బుమ్రా... బ్రావో వికెట్‌ తీసి 9 పరుగులే ఇచ్చాడు.

డికాక్‌ తప్పిదం వల్ల బైస్‌

డికాక్‌ తప్పిదం వల్ల బైస్‌

ఇందులో ఒక ఫోర్‌ కీపర్‌ డికాక్‌ తప్పిదం వల్ల వచ్చిన బైస్‌ కావడం గమనార్హం. ఇలా మలింగ, హార్దిక్ పాండ్యా భారీ పరుగులు సమర్పించుకున్నప్పటికీ... బుమ్రా ఆ తర్వాతి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై ఆశలను సజీవంగా ఉంచాడు. ఇక, ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి.

ఆఖరి ఓవర్ మలింగకు ఆశ్చర్యం

ఈ దశలో కెప్టెన్ రోహిత్ అంతకముందు ఓవర్‌లో భారీగా పరుగులిచ్చుకున్న మలింగకు మరోసారి బంతినివ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, మలింగ తన అనుభవంతో ముంబైని గెలిపించాడు. ఆఖరి ఓవర్‌లో కేవలం 7 పరుగులే ఇచ్చి ముంబైకి నాలుగోసారి ఐపీఎల్ టైటిల్‌ని అందించాడు.

Story first published: Monday, May 13, 2019, 14:57 [IST]
Other articles published on May 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X