IPL 2021: క్వారంటైన్‌ పూర్తయిన ఆనందంలో క్రిస్ గేల్‌ ఏం చేశాడంటే? (వీడియో)!

ముంబై: విండీస్‌ విధ్వంసకర వీరుడు, పంజాబ్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ తప్పనిసరి ఏడు రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అదిరిపోయిన స్టెప్పులతో యూనివర్సల్‌ బాస్‌ అలరించాడు. క్వారంటైన్‌ పూర్తైన ఆనందంలో గేల్‌.. మైఖేల్‌ జాక్సన్‌ సూపర్‌ హిట్‌ 'మూన్‌ వాక్‌' సాంగ్‌కు డ్యాన్స్‌ చేశాడు. బాస్ చిందేస్తుండగా తీసిన వీడియోను పంజాబ్‌ కింగ్స్‌ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'క్వారంటైన్‌ పూర్తయింది. మీ ఫేవరేట్ గేల్ బయటికి వచ్చాడు' అని పంజాబ్‌ ట్వీట్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన పంజాబ్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sunrisers Hyderabad: చెలరేగిన విజయ్ శంకర్, సాహా.. బెయిర్‌స్టో సేన చిత్తు!!

యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌.. క్వారంటైన్‌ సమయంలో కూడా పలు పంజాబీ పాటలకు తనదైన స్టైల్లో స్టెప్పులేస్తూ కాలక్షేపం చేశాడు. క్వారంటైన్‌ సమయంలో ఎక్కువ శాతం డ్యాన్స్‌లేస్తూ, జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గడిపాడు. పంజాబ్‌ కింగ్స్‌లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అయిన గేల్‌ ఈసారి కూడా మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో లేట్‌గా బరిలోకి దిగినా సూపర్‌ ఫామ్‌ను కనబర్చిన గేల్‌.. 7 మ్యాచ్‌ల్లో 137.14 స్ట్రయిక్‌ రేట్‌తో 288 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. క్యాష్‌రిచ్‌ లీగ్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్‌ వీరుడి పేరిట ఉంది.

యూనివ‌ర్స్ బాస్ 'క్రిస్‌ గేల్‌ రిటైర్మెంట్‌ ఎప్పుడూ?' అని చాలా కాలంగా వినిపిస్తున్న ప్రశ్న. అయితే గేల్‌ మాత్రం ఇంకొన్నేళ్లు తననేం అడగొద్దని అంటున్నాడు. 41 ఏళ్ల వ‌య‌సులో రిటైర్మెంట్ ఆలోచ‌న‌లు లేవ‌ని, 45 ఏళ్ల‌కు ముందు రిటైర్ అయ్యే ప్ర‌స‌క్తే లేద‌ని గేల్ స్పష్టం చేశాడు. ఇంకో రెండు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు ఆడ‌తాన‌ని తేల్చి చెప్పాడు. వ‌య‌సు కేవ‌లం ఒక నంబ‌రే అని కొట్టి పారేస్తున్నాడు. గేల్‌ విండీస్ తరఫున 103 టెస్టులు, 301 వన్డేలు, 61 టీ20లు ఆడాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021కి సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో మెగా లీగ్ ఆరంభం కానుంది. చెన్నై వేదికగా ఈ నెల 9న జరుగనున్న లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. ఏప్రిల్‌ 12న ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ను తమ తొలి మ్యాచులో ఢీకొంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 7, 2021, 21:36 [IST]
Other articles published on Apr 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X