న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RCB: భారత జట్టులో దక్కని చోటు.. సూర్యకుమార్‌కు రవిశాస్త్రి సందేశం!!

IPL 2020, MI vs RCB: India head coach Ravi Shastri posts message for Suryakumar Yadav

దుబాయ్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ భారత జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా సమావేశమైన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ టెస్టులు, వన్డేలు, టీ20లకు వేర్వేరు జట్లను ప్రకటించింది. ఐపీఎల్‌ 2020లో గాయపడిన ఓపెనర్ రోహిత్‌ శర్మ.. సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లను జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు. ఐపీఎల్‌లో రాణిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టీ20ల్లో చోటు దక్కించుకోగా.. ఫామ్ నిరూపించుకున్న రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్ తిరిగి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఇదే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం చోటు దక్కలేదు.

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. గ‌త రాత్రి ఐపీఎల్ టోర్నీలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో సూర్య కుమార్ (43 బంతుల్లో 79 నాటౌట్‌; 10ఫోర్లు, 3సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సూర్యకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. జాతీయ జట్టులో ఎంపిక కావాలంటే అతడు ఇంకేం చేయాలో అంటూ సెలక్టర్లపై పరోక్ష విమర్శలు గుప్పించారు.

సూర్యకుమార్ యాదవ్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రి అతడిని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. సూర్య న‌మ‌స్కారం అంటూ చేతులు జోడించిన ఓ ఎమోజీని పోస్టు చేశారు. 'సూర్య నమస్కార్‌. ధైర్యంగా, కాస్త ఓపికగా ఉండు' అంటూ కామెంట్ చేశారు. దీంతో వచ్చే పర్యటనకు నిన్ను తీసుకుంటాం అని ర‌విశాస్త్రి చెప్పకనే చెప్పాడు. ర‌విశాస్త్రి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బుధ‌వారం మ్యాచ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ.. సూర్య కుమార్‌ను స్లెడ్జింగ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తనను తీక్షణంగా చూస్తున్న కోహ్లీకి కళ్లతోనే అతడు బదులిచ్చాడు. ఇంట‌ర్నెట్‌లో కొంద‌రు ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోల‌ను పోస్టు చేశారు. స్థిరంగా ఆడుతున్న సూర్య‌కుమార్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు కోహ్లీపై నెటిజ‌న్స్ కామెంట్ చేశారు. ఆర్సీబీపై 79 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన సూర్య కుమార్‌ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

'అతని వల్లనే గర్భవతినయ్యా.. బిడ్డకు జన్మనివ్వబోతున్నా''అతని వల్లనే గర్భవతినయ్యా.. బిడ్డకు జన్మనివ్వబోతున్నా'

Story first published: Thursday, October 29, 2020, 16:21 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X