న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020, MI vs DC: రేపే బుమ్రా, రబాడకు ఫైనల్‌.. రేసులోకి ధావన్!!

IPL 2020 Final, MI vs DC: Purple Cap battle between Kagiso Rabada and Jasprit Bumrah

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020‌ చివరి అంకానికి చేరుకుంది. ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మంగళవారం రాత్రి జరగనుంది. ఐపీఎల్‌ 2020 విజేత ఎవరనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగా.. పర్పుల్‌, ఆరెంజ్‌ క్యాప్‌లను గెలుచుకునే ఆటగాళ్లెవరు అనే ఆసక్తి కూడా పెరిగిపోయింది.

మెగా టోర్నీలో ఆటగాళ్లంతా పోటాపోటీగా ఆడటంతో.. ఇప్పటి వరకూ పర్పుల్‌, ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆరెంజ్ క్యాప్ రేసులో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉండగా.. పర్పుల్ ‌క్యాప్ రేసులో కాగిసో రబాడ ముందున్నాడు. ఇంకా ఒక మ్యాచ్ ఉన్న నేపథ్యంలో స్థానాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు.

బుమ్రా vs రబాడ

బుమ్రా vs రబాడ

ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాఫ్రికా పేసర్ కాగిసో రబాడ 29 వికెట్లతో పర్పుల్ ‌క్యాప్ రేసులో టాప్‌లో ఉన్నాడు. గతరాత్రి జరిగిన క్వాలిఫయర్‌-2లో 4 వికెట్లు తీసి అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. 27 వికెట్లతో ముంబై బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తర్వాతి స్థానంలో ఉన్నాడు. 22 వికెట్లతో మరో ముంబై పేసర్ ట్రెంట్‌ బౌల్ట్‌ ఉన్నాడు. పర్పుల్ ‌క్యాప్ దక్కించుకునే అవకాశం న్యూజీలాండ్ పేసర్‌కు లేదు. రేసులో ఉంది రబాడ, బుమ్రా మాత్రమే.

రెండుసార్లు నాలుగేసి వికెట్లు

రెండుసార్లు నాలుగేసి వికెట్లు

రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌కు ముందు జరిగిన 4 మ్యాచ్‌ల్లో మూడింట్లో కాగిసో రబాడ వికెట్లు తీయలేకపోయాడు. కానీ క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆరంభంలోనే అద్భుత యార్కర్‌తో డేవిడ్ వార్నర్‌ను బౌల్డ్ చేశాడు. ఇక చివర్లో ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి సత్తాచాటాడు. రబాడ, బుమ్రా ఇద్దరూ ఈ సీజన్లో రెండుసార్లు నాలుగేసి వికెట్లు తీశారు. ఇరు జట్లలో కీలకమైన బుమ్రా, రబడ ఇద్దరిలో ఎవరు రేపు జరిగే ఫైనల్లో సత్తాచాటి పర్పుల్‌ క్యాప్‌ను అందుకుంటారో చూడాలి.

రాహుల్@1

రాహుల్@1

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లీగ్ దశలోనే నిష్క్రమించినా.. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ఆడిన ప్రతి మ్యాచులోనూ ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 55.83 యావరేజ్‌, 129.34 స్ట్రైక్ రేట్‌తో 670 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాహుల్ రాణించినా పంజాబ్ జట్టు మాత్రం ప్లే ఆఫ్ చేరలేదు. ఇక రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ముందు వరకూ రాహుల్‌కే ఆరెంజ్ క్యాప్ దక్కడం ఖాయమని భావించారంతా. కాని ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక్కసారిగా రేసులోకి వచ్చాడు.

IPL 2020 : Mumbai Indians Grand Entry Into IPL 2020 Finals | Beats DC By 57 Runs | MI Vs DC
ఆరెంజ్ క్యాప్ రేసులో గబ్బర్

ఆరెంజ్ క్యాప్ రేసులో గబ్బర్

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ (78; 50 బంతుల్లో, 6×4, 2×6) అర్ధ శతకంతో అదరగొట్టాడు. అంతేకాదు ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 46.38 యావరేజ్‌, 145.65 స్ట్రైక్ రేట్‌‌తో గబ్బర్ 603 రన్స్ చేశాడు. ఈ సీజన్ ఆరంభంలో పరుగులు చేయడంలో ఇబ్బంది పడిన ధావన్.. రెండు వరుస సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక రేపు జరిగే ఫైనల్లో 68 పరుగులు చేస్తే.. ధావన్ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుంటాడు. లేదా కేఎల్ రాహుల్ అందుకుంటాడు.

DC vs SRH: ఐపీఎల్ ఫైనల్‌కు చేరలేకపోవడం సిగ్గుచేటు: విలియమ్సన్

Story first published: Monday, November 9, 2020, 13:45 [IST]
Other articles published on Nov 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X