న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 12 ముంబై ఇండియన్స్‌దే: 1 పరుగు తేడాతో విజయం, ఎవరేమన్నారు?

IPL 2019 Final : Sachin Tendulkar And Others Reacts On Mumbai Indians Victory || Oneindia Telugu
IPL 2019: Mumbai Indians lift 4th IPL trophy with 1-win over Chennai Super Kings: Heres how the two teams reacted

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ ముగింపు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో చివరకు అంతిమ విజయం ముంబై ఇండియన్స్‌దే అయింది. ఉప్పల్‌ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (41 నాటౌట్‌), డికాక్ (29) ఫరవాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ మూడు, తాహిర్, శార్దూల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో షేన్ వాట్సన్ 59 బంతుల్లో 80(8 ఫోర్లు, 4సిక్సులు) చివరివరకు పోరాడినప్పటికీ ఓటమి నుంచి జట్టుని తప్పించలేకపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో బుమ్రా రెండు, రాహుల్‌ చాహర్‌ ఒక వికెట్ తీయగా... ఆఖరి ఓవర్‌లో అద్భుత బౌలింగ్‌తో ముంబై విజయంలో మలింగ కీలక పాత్ర పోషించాడు.

ముంబై విజయంలో కీలకపాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కి మొత్తం 32,405 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం ఎవరెవరు ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం....

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

ముంబై విజయం జట్టు అందరిది. ఈ టోర్నీలో బౌలర్లు గొప్పగా రాణించారు. కీలక సమయాల్లో సత్తా చాటారు. ఒక ఛాంపియన్‌ బౌలర్‌ ఏం చేయాలో మలింగ అదే చేశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ ఎలా ఆడతాడో నాకు తెలుసు. అందుకే స్లో యార్కర్‌ వేయమని మలింగకు చెప్పా. సరిగ్గా అతను అలాగే చేశాడు. గతంలో ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లాడిన చాంపియన్‌ ఆటగాడు మలింగపై నాకు నమ్మకం ఉంది. అందుకే అతనికి చివరి ఓవర్‌ ఇచ్చా. అది ఫలితాన్నిచ్చింది. ముందుగా ప్రణాళిక వేసుకున్నట్టుగా మేం టోర్నీని రెండు భాగాలుగా విభజించి ఆడడం కలిసొచ్చింది. ఈ సీజన్‌లో మా బౌలింగ్‌ అద్భుతం. ప్రతి బౌలర్‌కూ నిరూపించుకునేందుకు అవకాశం దక్కింది. ఈ ఘనత అంతా నాది కాదు. నేను కేవలం ఆటగాళ్ల ప్రతినిధిని మాత్రమే.

మహేంద్ర సింగ్ ధోని

జట్టుగా మేం బాగానే ఆడాం. మా బౌలర్లు చక్కగా బౌలింగ్‌ చేశారు. బ్యాటింగ్‌లో చిన్నచిన్న లోపాలున్నాయి. మా మిడిలార్డర్‌ ఈ సీజనంతా విఫలమైనా ఎలాగోలా ఫైనల్‌కు రాగలిగాం. వచ్చే సీజన్‌లో నిలకడైన ఆటతీరును ప్రదర్శించాలంటే ఏం చేయాలనే విషయమై మేం బాగా ఆలోచించాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా వరల్డ్‌కప్‌ రాబోతోంది. దాని గురించే ఇప్పుడిక ఆలోచన అంతా.

జస్ప్రీత్ బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా

చాలా సంతోషంగా ఉంది. ఫైనల్స్‌లో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగి చివర్లో విజయం సాధించడం మంచి అనుభూతినిస్తుంది. ఈరోజు నేను ఎలాంటి ఆందోళనకు గురికాకుండా చాలా కూల్‌గా ఉన్నా. జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది.

సచిన్ టెండూల్కర్ - ముంబై ఇండియన్స్ ఐకాన్, మెంటార్

ఈ మ్యాచ్‌లో కీ మూమెంట్ ఏదైనా ఉందంటే అది ధోని రనౌట్ అవడమే. మలింగ ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కీలక ఓవర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మరోవైపు కృనాల్ పాండ్యా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ... ఆ తర్వాత బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. మలింగ ఫినిష్ చేసిన తీరు నిజంగా అద్భుతం. ఆఖరి ఓవర్‌లో మలింగ బౌలింగ్ నిజంగా అద్బుతం. గతంలో ముంబై ఇండియన్స్ అనేక ఫైనల్స్ ఆడిన అనుభవం ఈ మ్యాచ్‌లో చాలా వరకు పనికొచ్చింది. ఈ జట్టులో అటు యువతతో పాటు అనుభవం కలిగిన కుర్రాళ్లు ఉన్నారు.

లసిత్ మలింగ

మేము ఒక పరుగు ఇచ్చినట్లైతే, ఈ మ్యాచ్‌లో విజయం సాధించేవాళ్లం కాదు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే తప్పకుండా వికెటీ తీయాల్సిందే. అందుకే వికెట్‌ తీసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా.

Story first published: Monday, May 13, 2019, 11:42 [IST]
Other articles published on May 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X