న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెపాక్‌లో CSK Vs MI: టాస్ నెగ్గిన చెన్నై, ధోని దూరం, అంకుర్ అరంగేట్రం

IPL 2019: CSK Vs MI, Live Updates: Chennai Super Kings win the toss and elect to bowl

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జ్వరం కారణంగా ఈ మ్యాచ్‌కి రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరమయ్యాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

దీంతో ధోని స్థానంలో సురేశ్ రైనా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు మూడు మార్పులతో ఈ మ్యాచ్ బరిలో దిగింది. ధోనీ, రవీంద్ర జడేజా, డుప్లెసిస్‌ల స్థానంలో ధృవ్ షోరే, మురళీ విజయ్, మిచెల్ శాంట్నర్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ముంబై రెండు మార్పులు చేసింది. బెన్‌ కట్టింగ్, మయాంక్ మార్కండే స్థానంలో ఎవిన్ లూయిస్, అంకుర్ రాయ్‌లను తీసుకన్నారు.

ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తరుపున అంకుర్ రాయ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌కి ముందు లసిత్ మలింగ చేతుల మీదగా యువ ఆటగాడు అంకుర్ రాయ్ ముంబై ఇండియన్స్ క్యాప్‌ని అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సీఎస్‌కే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌ను సీఎస్‌కే ఘనంగా ప్రారంభించింది. మొదటి 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచింది.

1
45920

ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మంగళవారం సొంతగడ్డపై సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో గనుక ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే ప్లేఆఫ్‌కు మరింతగా చేరువ అవుతుంది. ఈ సీజన్‌లో చెన్నైతో వాంఖడే జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది.

దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై భావిస్తోంది. కాగా, చెపాక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు జరగ్గా సీఎస్‌కే 12, ముంబై ఇండియన్స్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సీఎస్‌కే సొంతగడ్డపై జరుగుతన్నప్పటికీ ముంబై ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:
క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, లూయిస్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, అంకుర్ రాయ్

చెన్నై సూపర్ కింగ్స్:
షేన్ వాట్సన్, మురళీ విజయ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, డ్వేన్ బ్రావో, ధృవ్ షోరే, మిచెల్ శాంట్నర్

Story first published: Friday, April 26, 2019, 19:50 [IST]
Other articles published on Apr 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X