అచ్చం ధోనీలాగే: ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ వీడియో చూశారా?

Posted By:
IPL 2018: Young ishan kishan massive innings against delhi daredevils

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు వికెట్ కీపింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్


అంతకముందు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత వికెట్ కీపింగ్ నైపుణ్యం కనబర్చిన ఈ యువ వికెట్ కీపర్, తాజాగా శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

23 బంతుల్లోనే 42 పరుగులు రాబట్టి ముంబైని భారీ స్కోరుని పరిగెత్తించాడు. తొలి 7 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసిన ఇషాన్ ఆ తర్వాత చెలరేగి ఆడాడు. రాహుల్ తెవాతియా వేసిన ఇన్నింగ్స్ 13 ఓవర్లలో నాలుగో బంతిని ఫోర్‌గా మలిచిన ఇషాన్ మరుసటి బంతికి రివర్స్ స్వీప్‌తో సిక్స్ బాదాడు.

ఆ తర్వాతి బంతికి మరో సిక్స్ బాదడం ద్వారా మూడు బంతుల్లోనే 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్లో రెండు బౌండరీలు బాదాడు. ఇలా దూకుడుగా ఆడే క్రమంలో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్ కిషన్‌ను డానియేల్ క్రిస్టెన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి బౌల్డ్ చేశాడు.

దీంతో ఐపీఎల్‌లో రెండో అర్ధ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. కాగా, గత మ్యాచ్‌లో సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్యాచ్ అందుకున్న ఇషాన్.. అంపైర్ ఔటివ్వకపోవడంతో డీఆర్ఎస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. డీఆర్ఎస్ ఫలితం ఇషాన్ కిషాన్‌కు అనుకూలంగా వచ్చింది. ఇదే మ్యాచ్‌లో ఓపెనర్ సాహాను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చడంతో కీలకపాత్ర పోషించాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 14, 2018, 18:30 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి