ఐపీఎల్ 2018: బీమా కవరేజి ఎంతో తెలిస్తే వామ్మో అనాల్సిందే!

Posted By:
IPL 2018 takes mega insurance of Rs 2,500 crore for event, players

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ బీమా కంపెనీలకు కాసుల వర్షం కురిపించింది. ఐపీఎల్ ఏంటీ? బీమా కంపెనీలకు కాసుల వర్షం కురిపించడం ఏంటని అనుకుంటున్నారా? ఐపీఎల్ 11వ సీజన్ శనివారం ప్రారంభమై మే 27వరకు కొనసాగునున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్ కోసం అన్ని కేటగిరీల్లో కలిపి ఏకంగా రూ.2,500 కోట్లకు ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకున్నారంట.

గతేడాది జరిగిన అన్ని కేటగిరీల్లో కలిపి రూ. 1300 కోట్లు కాగా, ఈసారి ఆ మొత్తం రెట్టింపు అయింది. ఈ ఏడాది ఒక్కో ఐపీఎల్ జట్టుపై రూ.40 కోట్ల బీమా తీసుకున్నారు. అంతేకాదు ఐపీఎల్ ఈవెంట్ కోసం ప్రసార మాధ్యమాలు తీసుకున్న బీమా కవరేజి ఎంతో తెలుసా రూ. 1,500 కోట్లు. ఈ కవరేజీ కూడా ఇందులోనే ఉండటం విశేషం.

 పెద్ద మొత్తంలో బీమా తీసుకోవడం వెనుక

పెద్ద మొత్తంలో బీమా తీసుకోవడం వెనుక

ఇంత పెద్ద మొత్తంలో బీమా తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఏదైనా కారణం చేత ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దు అయినా లేక ఆలస్యమైనట్లైతే తద్వారా వాటిల్లే నష్టాన్ని బీమా పరిహారం రూపంలో పూడ్చుకునేందుకు కంపెనీలు ఇంత పెద్ద మొత్తంలో బీమా తీసుకున్నాయి. మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లకు అయ్యే గాయాలకు కూడా కవరేజీ ఉంది.

ఆటగాళ్ల ఫీజుల నష్టంపైనా కూడా ఈసారి బీమా

ఆటగాళ్ల ఫీజుల నష్టంపైనా కూడా ఈసారి బీమా

అంతేకాదు ఆటగాళ్ల ఫీజుల నష్టంపైనా కూడా ఈసారి బీమా తీసుకోవడం విశేషం. పరిహారం కోసం క్లెయిమ్‌లు ఎక్కువ అవడంతో ఈ ఏడాది బీమా సంస్థలు పాలసీల ప్రీమియాన్ని పెంచాయి. ఇక, ఐపీఎల్ 2018 సీజన్ ప్రైజ్ మనీ విషయానికి వస్తే అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లతో పోల్చుకుంటే ఈ ప్రైజ్ మనీ చాలా తక్కువగా ఉంది.

ఐపీఎల్ 11వ సీజన్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

ఐపీఎల్ 11వ సీజన్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

ఫిఫా, వింబుల్డన్ లాంటి టోర్నమెంట్లతో పోల్చుకుంటే ఐపీఎల్ ద్వారా ఆటగాళ్ళకు లభించేది మాత్రం చాలా తక్కువే అని తెలుస్తోంది. ఐపీఎల్ 11వ సీజన్‌లో విజేత జట్టుకిచ్చే మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.56 కోట్లు. టోర్నీ విజేతగా నిలిచిన జట్టు మొత్తానికి కలిపి ఇచ్చేది రూ.26 కోట్లు, రన్నరప్‌కు అందులో సగం అంటే రూ.13 కోట్లు అందిస్తారు.

తొలి మ్యాచ్ ముంబై-చెన్నై జట్ల మధ్య

తొలి మ్యాచ్ ముంబై-చెన్నై జట్ల మధ్య

ఇక ప్రతి మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌, అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ఆటగాళ్లకు బహుమతులు ఇస్తారు. ఇవన్నీ కలుపుకుంటే రూ.56 కోట్లు. శనివారం ప్రారంభం కానున్న ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరగనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 7, 2018, 16:49 [IST]
Other articles published on Apr 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి