న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి వరకు ఉత్కంఠ: చెన్నైపై రాజస్థాన్ విజయం, ప్లేఆప్ ఆశలు సజీవం

By Nageshwara Rao
Butler

హైదరాబాద్: ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. జైపూర్ వేదికగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్స్ రేసులో ఆశలను సజీవంగా ఉంచుకుంది.

చెన్నై నిర్ధేశించిన 177పరుగుల లక్ష్య ఛేదనను రాజస్థాన్ రాయల్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. రాజస్తాన్‌ ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌ (95 నాటౌట్‌; 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మరోవైపు సంజూ శాంసన్‌(21), స్టువర్ట్‌ బిన్నీ(22)లు ఫర్వాలేదనిపించారు. తాజా విజయంతో రాజస్థాన్ రాయల్స్ 10 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది. చెన్నై బౌలర్లలో డేవిడ్ విల్లీ, భజ్జీ, జడేజా, శార్దుల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.


1
43453

15 ఓవర్లకు రాజస్థాన్ 122/4
చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ధేశించిన 177పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (66), స్టువర్ట్‌ బిన్నీ (10) పరుగులతో ఉన్నారు. ఆ జట్టు గెలవాలంటే 30 బంతుల్లో 55 పరుగులు చేయాలి.


10 ఓవర్లకు రాజస్థాన్ 88/2
చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ధేశించిన 177పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్‌(58), శాంసన్‌(13) పరుగులతో ఉన్నారు.


వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్
చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ధేశించిన 177పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. హర్భజన్‌ బౌలింగ్‌లో నాలుగో ఓవర్‌ చివరి బంతిని ఆడిన బెన్‌ స్టోక్స్‌ (11) క్లీన్‌బౌల్డ్‌ కాగా, ఆ మరుసటి ఓవర్‌లో జడేజా బౌలింగ్‌లో రహానే (4) రైనాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌‌కు చేరాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ రెండు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్‌(40), శాంసన్‌(1) పరుగుతో ఉన్నారు.


3 ఓవర్లకు రాజస్థాన్ 33/0
చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ధేశించిన 177పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌కు శుభారంభం లభించింది. చెన్నై బౌలర్‌ డేవిడ్‌ విల్లే వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ జోస్ బట్లర్‌ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత హర్ఛజన్‌ సింగ్‌ వేసిన ఓవర్‌లోనూ రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్‌(32), బెన్‌ స్టోక్స్‌ (1) పరుగుతో ఉన్నాడు.


రాజస్థాన్ విజయ లక్ష్యం 177

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచారు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా (52: 35 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు), షేన్ వాట్సన్ (39: 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు), ధోని (23 బంతుల్లో 33 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌‌కు 177 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీసుకోగా... ఇష్ సోథీ ఒక వికెట్ తీసుకున్నాడు.


18 ఓవర్లకు చెన్నై 153/3
జైపూర్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం 18 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. క్రీజులో ధోని(26), సామ్ బిల్లింగ్స్(12) పరుగులతో ఉన్నారు.


14 ఓవర్లకు చెన్నై 125/3
జైపూర్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఇష్ సోథీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఆఖరి బంతికి సురేశ్ రైనా(52) హాఫ్ సెంచరీ అనంతరం స్టువర్ట్ బిన్నీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 14 ఓవర్లకు గాను చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధోని(8), సామ్ బిల్లింగ్స్(5) పరుగులతో ఉన్నారు.


రెండో వికెట్ కోల్పోయిన చెన్నై
జైపూర్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 105 పరుగుల వద్ద ఓపెనర్ షేన్ వాట్సన్ (39) జోఫ్రా ఆర్చర్‌ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధోని(1), సురేశ్ రైనా(50) పరుగులతో ఉన్నారు.


10 ఓవర్లకు చెన్నై 90/1
జైపూర్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో షేన్ వాట్సన్(30), సురేశ్ రైనా (42) పరుగులతో ఉన్నారు.


6 ఓవర్లకు చెన్నై 55/1
జైపూర్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలకడగా ఆడుతోంది. పవర్‌ ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 55 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఓపెనర్ అంబటి రాయుడు (12) ఔటైనా ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా (29 నాటౌట్) దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నాడు. షేన్ వాట్సన్ (10) పరుగులతో క్రీజులో ఉన్నాడు.


3 ఓవర్లకు చెన్నై 30/1
జైపూర్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి ఓపెనర్‌ అంబటి రాయుడు (12) బౌల్డయ్యాడు. బ్యాట్‌కు తాకిన బంతి నేరుగా వికెట్లు తాకింది. ప్రస్తుతం 3 ఓవర్లకు గాను చెన్నై ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. క్రీజులో షేన్‌ వాట్సన్‌ (7), సురేశ్‌ రైనా (9) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో ధ్రువ్, ఎంగిడి స్థానంలో కర్ణ్ శర్మ, శామ్ బిల్లింగ్స్‌‌కి ధోనీ అవకాశం కల్పించగా.. రాజస్థాన్ తుది జట్టులోకి అంకిత్ శర్మ , ప్రశాంత్ చోప్రా చోటు కల్పించింది. ఈ సీజన్‌లో ప్రశాంత్‌కి ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పింక్ జెర్సీలో ఈ మ్యాచ్ ఆడనుంది. ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ధరించబోయే పింక్ జెర్సీకి సంబంధించిన పోటోలను ఆ జట్టు యాజమాన్యం ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.

ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాయల్స్ జట్టు మూడు రంగులతో కూడిన ఈ ప్రత్యేకమైన జెర్సీని రూపొందించింది. ఇందులో పింక్ రంగు బ్రెస్ట్ క్యాన్సర్‌‌ని, బర్గండి రంగు ఓరల్ క్యాన్సర్‌ని, టీల్ రంగు సెర్వికల్ క్యాన్సర్‌ని ప్రతిబింబిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ మొదలుపెట్టిన ఈ ప్రచారానికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, జాతీయ క్యాన్సర్ గ్రిడ్, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆఫ్ ది స్టేట్ మద్దుతు పలికాయి.

టోర్నీలో భాగంగా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో రాయల్స్ ప్లే ఆఫ్ అవకాశాలు తగ్గిపోయాయి. ఈ మ్యాచ్‌లో గనుక రాజస్థాన్ ఓడిపోతే ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయినట్టే.

రాజస్థాన్ రాయల్స్‌కు ఈ మ్యాచ్ గెలుపు తప్పనిసరికాగా.. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు చెన్నై ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ రాజస్థాన్ సొంత మైదానం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పటివరకు జైపూర్‌లో నాలుగు మ్యాచ్‌లకు గాను మూడింటిలో రాజస్థాన్ గెలిచింది.

జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:

షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, శామ్ బిల్లింగ్స్, మహేంద్రసింగ్ ధోని, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ, హర్భజన్ సింగ్, శార్ధూల్ ఠాకూర్

రాజస్థాన్ రాయల్స్ జట్టు:
అజింక్య రహానె, జోస్ బట్లర్, ప్రశాంత్ చోప్రా, సంజు శాంసన్, బెన్ స్టోక్స్, స్టువర్ట్ బిన్నీ, గౌతమ్, ఆర్చర్, అంకింత్ శర్మ, జయదేవ్ ఉనద్కత్, ఇస్ సోధి

Story first published: Saturday, May 12, 2018, 0:05 [IST]
Other articles published on May 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X