ధోని సిక్స్‌ బాదినా: చెన్నై వరుస విజయాలకు చెక్ పెట్టిన పంజాబ్

their two-year suspension

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్రేక్ వేసింది. చెన్నైపై 4 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ ధోనీ 44 బంతుల్లో(79) నాటౌట్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. రాయుడు (49) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై 2 వికెట్లు పడగొట్టాడు.


చెన్నై సూపర్ కింగ్స్‌కి భారీ స్కోరుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సవాల్ విసిరింది. కాగా, పంజాబ్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 197/7 స్కోరు చేసింది. మొహాలి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్ క్రిస్‌గేల్ 33 బంతుల్లో (63), కేఎల్ రాహుల్ (37) చెలరేగి ఆడారు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు గేల్. మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులను తన సిక్సర్లతో అలరించాడు.

షేన్ వాట్సన్ వేసిన అనూహ్య బంతిని షాట్ ఆడగా.. బ్యాట్‌కు టాప్ ఎడ్జ్ అయిన బంతి ఫీల్డర్ ఇమ్రాన్ తాహిర్ చేతిలో పడింది. దీంతో యూనివర్స్‌ బాస్‌.. గేల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం తనదైన శైలిలో మరోసారి విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు చుక్కలు కనిపించాయి.

మయాంక్ అగర్వాల్ (30)దూకుడుగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. గేల్ దూకుడుతో తొలి పది ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న చెన్నై బౌలర్లు చివర్లో అద్భుతంగా పుంజుకుని పంజాబ్‌‌ని కట్టడి చేశారు.


వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై జట్టు పంజాబ్‌లోని మొహాలీ వేదికగా పంజాబ్ తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఫీల్డింగ్ నే ఎంచుకుంది. గాయం కారణంగా సురేశ్ రైనా ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు ధోనీ తెలిపాడు. అతని స్థానంలో మురళీ విజయ్ జట్టులోకి వచ్చాడు.

మరోవైపు పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన విధ్వంసకర క్రిస్‌గేల్ చెన్నైతో మ్యాచ్‌కు ఎంపిక చేశారు. మార్కస్ స్టాయినిస్ స్థానంలో గేల్‌ను తీసుకున్నట్లు పంజాబ్ సారథి అశ్విన్ పేర్కొన్నాడు. మరోవైపు అక్షర్ పటేల్ స్థానంలో బరిందర్ సరన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. రెండు జట్లు అన్ని రంగాల్లో సమానంగా ఉండటంతో రసవత్తర పోరు జరగనుంది.


ఆడనున్న జట్లు:
Punjab:

Lokesh Rahul (wk), Chris Gayle, Mayank Agarwal, Aaron Finch, Yuvraj Singh, Karun Nair, Ravichandran Ashwin (c), Andrew Tye, Barinder Sran, Mohit Sharma, Mujeeb Ur Rahman

Chennai:
Shane Watson, Ambati Rayudu, Murali Vijay, MS Dhoni (c) (wk), Sam Billings, Ravindra Jadeja, Dwayne Bravo, Deepak Chahar, Harbhajan Singh, Shardul Thakur, Imran Tahir

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Sunday, April 15, 2018, 19:55 [IST]
  Other articles published on Apr 15, 2018

  Latest Videos

   + More
   POLLS

   Get breaking news alerts from myKhel

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more