యూనివర్స్ బాస్ గేల్ ఈజ్‌ బ్యాక్‌: ప్రత్యర్ధి జట్లకు బ్యాడ్ న్యూస్

Posted By:
IPL 2018: Gayle is back and that is bad news for other teams: Rahul

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లో క్రిస్ గేల్‌కు అవకాశం ఇవ్వని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం కీలమైన చెన్నైతో మ్యాచ్‌లో ఆడే అవకాశాన్ని పంజాబ్ కల్పించింది.

తనకు వచ్చిన అవకాశాన్ని గేల్ చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి అద్భుత ప్రదర్శన చేయడంతో పవర్ ప్లేలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 75 పరుగులు చేసింది.

ఐపీఎల్‌లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ

అంతేకాదు 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేసిన తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో వేగవంగమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ సీజన్‌లో తొలిసారి కింగ్స్ ఎలెవన్‌ తరఫున ఆడిన గేల్‌ చాహల్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదిన సంగతి తెలిసిందే. 33 బంతుల్లో 63 పరుగులు చేసి పంజాబ్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ప్రత్యర్ధి జట్లకు బ్యాడ్ న్యూస్

ప్రత్యర్ధి జట్లకు బ్యాడ్ న్యూస్

ఈ సందర్భంగా పంజాబ్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ 'క్రిస్ గేల్ ఫామ్‌లోకి రావడం మా జట్టుకు అమేజింగ్ న్యూస్ అయితే, ప్రత్యర్ధి జట్లకు బ్యాడ్ న్యూస్. మనందరికీ తెలుసు క్రిస్ గేల్ సింగిల్ హ్యాండ్‌తో జట్టుకు విజయాలను అందించగలడు. ఈరోజు అదే తాను నిరూపించాడు. ఇదే ఫామ్‌తో గేల్ కొనసాగాలని కోరుకుంటున్నాం' అని అన్నాడు.

ఫోర్లు, సిక్స్‌లు కొట్టేందుకు గేల్‌ వచ్చేశాడు

మరోవైపు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న తర్వాత గేల్‌ మాట్లాడుతూ 'ఈ రోజు మ్యాచ్‌లో ఆడుతున్నట్లు ఉదయం తెలిసింది. కొత్త ఫ్రాంఛైజీ తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే విజయం దక్కింది. సంతోషంగా ఉంది. ఫోర్లు, సిక్స్‌లు కొట్టేందుకు గేల్‌ వచ్చేశాడు. ఇప్పుడు నేను 25ఏళ్ల వయస్సు వాడిలా ఫీలవుతున్నా. ది యూనివర్స్‌ బాస్‌ ఈస్‌ బ్యాక్‌' అని అన్నాడు.

హర్ష భోగ్లే

మైదానంలోకి వచ్చిన తర్వాత గేల్‌ ఎంత స్కోరు చేస్తాడు అన్నది మేటర్‌ కాదు. అతను మైదానంలో ఉన్నంతసేపు అదో టెన్షన్‌

మహమ్మద్‌ కైఫ్‌

మొహాలీలో దీపావళి ముందుగానే వచ్చింది. అతను మైదానంలో ఉన్నంతసేపు అభిమానులకు వేడుకే:

వీరేంద్ర సెహ్వాగ్

పంజాబ్ జట్టుకు గెలుపు శుభాకాంక్షలు. ధోని బ్యాట్ నుంచి మరో అద్భుత హాఫ్ సెంచరీ. క్రిస్ గేల్ అద్భుత ఆటతీరు... మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ గెలిచింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 16, 2018, 14:03 [IST]
Other articles published on Apr 16, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి