న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

12 కోట్ల మంది 50 కోట్ల ఇంటరాక్షన్స్‌: ఎక్కువ సార్లు ఉపయోగించిన పదం 'లవ్'

గత ఆదివారం ఐపీఎల్ పదో సీజన్ ఘనంగా ముగిసింది. విజేతగా ముంబై ఇండియన్స్ అవతరించింది. హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన పైనల్‌లో ఒక పరుగు తేడాతో ముంబై విజయం సాధించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: గత ఆదివారం ఐపీఎల్ పదో సీజన్ ఘనంగా ముగిసింది. విజేతగా ముంబై ఇండియన్స్ అవతరించింది. హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన పైనల్‌లో ఒక పరుగు తేడాతో ముంబై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దాదాపు ఆరు వారాల పాటు క్రికెట్ అభిమానులను ఐపీఎల్ అలరించింది. పదో సీజన్‌ ముగిసిన తర్వాత ఇనిస్టాగ్రామ్ ఓ నివేదికను విడుదల చేసింది. అందులో ఐపీఎల్ పదో సీజన్ ముగిసేలోపు 12 కోట్ల మంది 50 కోట్ల ఇంటరాక్షన్స్‌ జరిపారు. ముంబై ఇండియన్స్‌, రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గురించి ఎక్కువ పోస్టులు, కామెంట్లు పెట్టారు.

ఇక, ఐపీఎల్ పదో సీజన్‌లో ఇనిస్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు, ఫాలోవర్స్ పొందిన క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్ధానాల్లో ధోని(రైజింగ్ పూణ సూపర్ జెయింట్), ఏబీ డివిలియర్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) నిలిచారు.

IPL 2017: 120 million people engage in 500 mn interactions on Instagram; Kohli most loved

లీగ్‌ సాగినన్ని రోజులూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు ఐపీఎల్‌పై ప్రేమ కురిపించారు. ఐపీఎల్ పదో సీజన్ ముగిసేంత వరకు ఆటగాళ్లు, జట్లు చిత్రాలతో పాటు కంటెంట్‌ని పోస్టు చేశాయి. ఇక ఇనిస్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అయిన జట్లలో ముంబై ఇండియన్స్ మొదటి స్ధానంలో నిలవగా, ఆ తర్వాత రైజింగ్ పూణె సూపర్ జెయింట్ నిలిచింది.

ఈ సీజన్‌లో అత్యధిక మంది ఎమోషనల్‌గా ఉపయోగించిన పదం 'లవ్'. ఈ సీజన్‌లో మొత్తం 165 మంది ఆటగాళ్లు తమ తమ ఇనిస్టాగ్రామ్ ఖాతాల్లో ఐపీఎల్‌కు సంబంధించిన విశేషాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. విరాట్‌ కోహ్లీ గాయం నుంచి కోలుకొని తిరిగి రావడం, రాజ్‌కోట్‌లో క్రిస్‌గేల్‌కు స్వాగతం, జహీర్‌ఖాన్‌ నిశ్చితార్థం గురించి ఎక్కువ ఇంటరాక్షన్‌ జరిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X