న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌: వీక్షణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన ఫైనల్‌ మ్యాచ్‌

By Nageshwara Rao
IPL 2018: IPL Finals Creates Record In The Viewership
IPL-11 final records historic viewership

హైదరాబాద్: ముంబైలోని వాంఖడె వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సరికొత్త రికార్డును సృష్టించింది. టీవీ వీక్షకుల ఆదరణలో ఈ సీజన్‌ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఏ ఫైనల్‌ మ్యాచ్‌కు దక్కని వ్యూవర్‌ షిప్‌ ఈ సీజన్ ఫైనల్‌ మ్యాచ్‌ దక్కించుకుంది.

ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై విజయం

ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై విజయం

మే 27న ముంబైలోని వాంఖడే మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

 8 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం

8 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం

ఐపీఎల్ 11వ సీజన్‌ మ్యాచ్‌లను స్టార్‌ టీవీ నెట్‌వర్క్‌ 8 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. హాట్‌స్టార్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది.

ఫైనల్‌ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 211 మిలియన్లు

ఫైనల్‌ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 211 మిలియన్లు

ఐపీఎల్‌ 11వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 211 మిలియన్ల మంది వీక్షించారట. ఒక్క స్టార్‌ టీవీ నెట్‌వర్క్‌ చానళ్లలోనే 16 కోట్ల మందికి పైగా వీక్షించారు. దూరదర్శన్‌లో చూసిన వీక్షకులు దీనికి అదనం. గతేడాది రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌-ముంబైఇండియన్స్‌ మధ్య జరిగిన టైటిల్‌ పోరును 12 కోట్ల 10 లక్షల మంది వీక్షించారు.

ఈ ఏడాది పెరిగిన వీక్షకులు 32 శాతం

ఈ ఏడాది పెరిగిన వీక్షకులు 32 శాతం

దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది 32 శాతం వీక్షకులు పెరగడం పెద్ద విశేషం. గతంతో పోలిస్తే హాట్‌స్టార్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై 19 శాతం వీక్షకులు పెరిగారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్‌లను 29 శాతం అధికంగా వీక్షించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఏడాది స్టార్‌ నెట్‌వర్క్‌ ప్రాంతీయ భాషల్లో కూడా మ్యాచ్ ప్రసారం చేయడం వల్లే అద్భుత స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

Story first published: Friday, June 8, 2018, 13:44 [IST]
Other articles published on Jun 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X