న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రావో రిటైరవ్వడం క్రికెట్‌కే తీవ్రమైన లోటు'

International cricket loses a good allrounder in Bravo: CSK CEO Kasi Viswanathan

హైదరాబాద్: వెస్టిండిస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈఓ కాశీ విశ్వనాథన్‌ స్పందించారు. బ్రేవో క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పడం అంతర్జాతీయ క్రికెట్‌కు తీవ్రమైన లోటుగా ఆయన పేర్కొన్నారు.

విండీస్‌ ఇప‍్పటికే తీవ్ర కష్టాల్లో పడి:

‘బ్రావో ఒక అరుదైన ఆల్‌‌రౌండర్‌. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం కచ్చితంగా క్రికెట్‌కు లోటే. ప్రధానంగా వన్డే, టీ20 ఫార్మాట్‌లో బ్రావో స్థానం ప్రత్యేకం. అతను ఉపయోగకరమైన ఆల్‌‌రౌండర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక నాణ్యమైన ఆల్‌ రౌండర్‌ను విండీస్‌ తప్పకుండా మిస్సవుతుంది. చాలామంది టాప్‌ ఆటగాళ్లు లేకపోవడంతో విండీస్‌ ఇప‍్పటికే తీవ్ర కష్టాల్లో పడింది.'

సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న బ్రావో:

'ఈ తరుణంలో బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పడం విండీస్‌కు పెద్ద లోటే అవుతుంది. . అయితే ప్రొఫెషనల్‌ కెరీర్‌ను కొనసాగిస్తానని బ్రావో చెప్పడం సంతోషించదగ్గ విషయం'అని విశ్వనాథన్‌ పేర‍్కొన్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బ్రావో ఆడుతున్న సంగతి తెలిసిందే.

అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్

‘అంతర్జాతీయ క్రికెట్‌ అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్ అవుతున్నా. 14ఏళ్ల క్రితం వెస్టిండిస్‌ తరఫున అరంగేట్రం చేసిన క్షణాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. 2004 జులైలో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్‌ ఆడటానికి మైదానంలోకి వెళ్లే ముందు మెరూన్‌ క్యాప్‌ అందుకున్నా. ఆ రోజు కలిగిన అనుభూతి, ఉత్సాహం.. ఇన్నేళ్ల కెరీర్‌లో ప్రతిక్షణం తోడుగా ఉన్నాయి. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా సుదీర్ఘకాలం కొనసాగాను. యువతరం క్రికెటర్లకు కూడా ఆ అవకాశం రావాలి. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నా' అని బ్రావో ప్రకటించారు.

మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు

ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబం, తోటి ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫ్రాంచైజీల్లో కొనసాగుతానని బ్రావో పేర్కొన్నారు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బ్రావో.. తన కెరీర్‌లో 40 టెస్టులు, 164 వన్డేలు, 66 టీ20లు ఆడారు. చివరిసారిగా 2014లో భారత్‌పై బ్రావో ఆఖరి వన్డే ఆడారు. ఆ సమయంలో బ్రావో విండిస్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు.

Story first published: Thursday, October 25, 2018, 15:52 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X