న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : ఈ సిరీస్‌లో రాణిస్తే భవిష్యత్తు బంగారమే.. కొత్త రోల్‌లో మెరిపిస్తాడా?

INDvsNZ ODI series is too important for Ishan Kishan

న్యూజిల్యాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగే తొలి వన్డేకు ముందు ప్రెస్ మీట్‌లో పాల్గొన్న రోహిత్ శర్మ జట్టు కూర్పు గురించి వెల్లడించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్‌ను తొలి వన్డేలో ఆడిస్తున్నామని, అయితే అతను ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో వస్తాడని చెప్పాడు. కేఎస్ భరత్‌ను కాకుండా కిషన్‌కు మిడిలార్డర్‌లో చోటు దక్కడం ఆశ్చర్యం కలిగించినా ఈ నిర్ణయం మాత్రం అతని భవిష్యత్తును మార్చేస్తుంది.

రాహుల్‌కు సరైన బ్యాకప్

రాహుల్‌కు సరైన బ్యాకప్

టీమిండియాలో అన్ని ఫార్మాట్లలో వికెట్ కీపర్‌గా ఉన్న రిషభ్ పంత్‌కు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. దీంతో అతను వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను టీం మేనేజ్‌మెంట్ ప్రమోట్ చేసింది. అయితే అతని బ్యాకప్ ఎవరనే ప్రశ్న మేనేజ్‌మెంట్‌కు పెద్ద సమస్యగా మారింది. కిషాన్ ఓపెనర్ కావడంతో అతన్ని రాహుల్ బ్యాకప్‌గా ఎవరూ అనుకోలేదు. సంజూ శాంసన్ ఉన్నప్పటికీ అతను గాయంతో ఉన్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇషాన్ కిషన్ ఉపయోగించుకొని, కివీస్‌పై రాణిస్తే రాహుల్ బ్యాకప్‌గా అతను తన స్థానాన్ని పదిలం చేసుకునే ఛాన్స్ ఉంది.

మిడిలార్డర్‌లో కీలకం

మిడిలార్డర్‌లో కీలకం

కివీస్‌తో సిరీస్‌లో కొత్త రోల్‌లో ఆడనున్న ఇషాన్ కిషన్‌కు ఇది సువర్ణావకాశంలా కనిపిస్తోంది. రాహుల్‌, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ఈ సిరీస్ ఆడటం లేదు. దీంతో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌కు చోటు దక్కడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కిషన్ కనుక కొత్త రోల్‌లో రాణిస్తే అతను మిడిలార్డర్‌లో కూడా చాలా కీలకంగా మారతాడు. సాధారణంగా ఓపెనర్‌గా వచ్చే కిషన్‌కు వన్డే ఫార్మాట్‌లో అవకాశం దక్కడం కష్టంగా కనిపిస్తోంది. వన్డేల్లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించడమే దీనికి కారణం. కాబట్టి మిడిలార్డర్‌లో కనుక తన సత్తా నిరూపించుకుంటే జట్టుకు మరిన్ని ఆప్షన్స్ దొరికనట్లే.

ఆసీస్ టూర్‌కు కీలకం

ఆసీస్ టూర్‌కు కీలకం

ఇషాన్ కిషన్‌కు తొలి సారి భారత టెస్టు టీం నుంచి పిలుపొచ్చింది. ఆసీస్‌తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతన్ని ఎంపిక చేశారు. రిషభ్ లేకపోవడంతో అతని స్థానంలో ఎవర్ని దింపాలనే సమస్య తలెత్తింది. కిషన్ కనుక కివీస్‌తో సిరీస్‌లో మిడిలార్డర్‌లో రాణిస్తే.. ఆస్ట్రేలియా టెస్టుల్లో కూడా మేనేజ్‌మెంట్ అతనివైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిరీస్‌లో రాణించడం, ముఖ్యంగా మిడిలార్డర్‌లో తన విలువ చూపించుకోవడం అతనికి చాలా అవసరం. అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు కివీస్ పేసర్లను ఎదుర్కోవడం కూడా మంచి అనుభవమే.

Story first published: Wednesday, January 18, 2023, 12:50 [IST]
Other articles published on Jan 18, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X