కోహ్లీదే అగ్రస్థానం, తొలి న్యూజిలాండ్ క్రికెటర్‌గా కేన్ విలియమ్సన్

Indians shine in latest ICC Test rankings

హైదరాబాద్: ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఆదివారంతో తొలి టెస్టు ముగిసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కోహ్లీకి ధీటుగా పోస్టు పెట్టి శుభాకాంక్షలు తెలిపిన అనుష్క

ఈ టెస్టు మ్యాచ్ అనంతరం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 920 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అడిలైడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 3, రెండో ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేశాడు. ఇక, పాకిస్థాన్‌తో జరిగిన ఆఖరి టెస్టులో సెంచరీతో రాణించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో స్థానానికి ఎగబాకాడు.

రెండో స్థానంలో కేన్ విలియమ్సన్

రెండో స్థానంలో కేన్ విలియమ్సన్

అబుదాబి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 89, రెండో ఇన్నింగ్స్‌లో 139 పరుగులు చేసిన కేన్ విలియన్స్ 1969 తర్వాత పాకిస్థాన్‌పై 2-1తేడాతో టెస్టు సిరిస్‌ను నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కేన్ విలియన్స్ ఖాతాలో మొత్తం 913 పాయింట్లు ఉన్నాయి.

 టెస్టు క్రికెట్‌లో 900కి పైగా పాయింట్లు

టెస్టు క్రికెట్‌లో 900కి పైగా పాయింట్లు

తద్వారా న్యూజిలాండ్ తరుపున టెస్టు క్రికెట్‌లో 900కి పైగా పాయింట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా కేన్ విలియమ్సన్ నిలిచాడు. ఇక, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక, తొలి టెస్టులో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పుజారా తన ర్యాంకుని మరింతగా మెరుగుపరచుకున్నాడు.

టెస్టు ర్యాంకుని మెరగపరుచుకున్న పుజారా

టెస్టు ర్యాంకుని మెరగపరుచుకున్న పుజారా

అడిలైడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 123, రెండో టెస్టులో 71 పరుగులు చేసిన పుజారా టెస్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఒక స్థానం దిగజారి ఐదో స్థానంలో నిలవగా... ఆసీస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఆరో స్థానంలో నిలిచాడు. పాక్‌తో జరిగిన మూడో టెస్టులో సెంచరీ బాదిన కివీస్ ఆటగాడు హెన్రీ నికోలస్ ఎనిమిది స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

బ్యాట్స్‌మన్ ర్యాంకులు:

1. Virat Kohli (India)- 920

2. Kane Williamson (New Zealand)- 913

3. Steve Smith (Australia)- 901

4. Cheteshwar Pujara (India)- 846

5. Joe Root (England)- 807

6. David Warner (Australia)- 795

7. Dimuth Karunaratne (Sri Lanka)- 753

8. Dean Elgar (South Africa)- 724

9. Henry Nicholls (New Zealand)- 709

10. Azhar Ali (Pakistan)- 708

 బౌలర్లలో అగ్రస్థానం రబాడదే

బౌలర్లలో అగ్రస్థానం రబాడదే

బౌలర్ల ర్యాంకుల విషయానికి వస్తే దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో భారత్ నుంచి రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు చోటు దక్కించుకున్నారు.

బౌలర్ల ర్యాంకులు:

1. Kagiso Rabada (South Africa)- 882

2. James Anderson (England)- 874

3. Vernon Philander (South Africa)- 826

4. Mohammad Abbas (Pakistan)- 821

5. Ravindra Jadeja (India)- 804

6. Ravichandran Ashwin (India)- 786

7. Pat Cummins (Australia)- 770

8. Trent Boult (New Zealand)- 764

9. Yasir Shah (Pakistan)- 755

10. Jason Holder (West Indies)- 751

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, December 11, 2018, 15:47 [IST]
Other articles published on Dec 11, 2018
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more