న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎన్‌సీఏలో యో-యో టెస్టు: అంతా పాసయ్యామని ట్విట్టర్‌లో గోస్వామి

By Nageshwara Rao
Indian Womens Cricket Team passes Yo-Yo Test at NCA

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే యో-యో పరీక్ష ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలిసిందే. ఈ టెస్టు పాసైతేనే జట్టులో చోటు దక్కించుకుంటారు. ఇటీవల షమీ, అంబటి రాయుడులాంటి కొందరు స్టార్‌ క్రికెటర్లు ఈ పరీక్షలో ఫెయిలవడం.. జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడాన్ని మనం చూశాం.

ఆ తర్వాత యో-యో టెస్టులో పాసైన షమీ తిరిగి ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. తాజాగా ఈ టెస్టును భారత మహిళల క్రికెట్‌ జట్టు సభ్యులు కూడా ఎదుర్కొన్నారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన టెస్టుకు స్టార్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి సహా కొందరు క్రీడాకారిణులు హాజరయ్యారు.

తామంతా యో-యో టెస్టుని విజయవంతంగా అధిగమించామని గోస్వామి తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. "బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన యో యో టెస్టులో జట్టు సభ్యులందరం పాసయ్యాం" అని గోస్వామి తన ట్విట్టర్‌లో పేర్కొంది.

✅ yo yo done 🔝💯 #day1 #welldonegirls👏

A post shared by Jhulan Goswami (@jhulangoswami) on

ప్రస్తుతం కొందరు జట్టు సభ్యులు ఇతర దేశాల్లో లీగ్‌లు ఆడుతున్నందున యో యో టెస్టులో పాల్గొనలేకపోయారు. ఈ కారణంగా వీరు యో యో టెస్టుకు హాజరుకాలేదు. త్వరలో వీరు కూడా హాజరవుతారని అకాడమీ అధికారులు తెలిపారు. ఇటీవల ముగిసిన ఆసియాకప్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌ చేరిన భారత్‌.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, July 28, 2018, 11:04 [IST]
Other articles published on Jul 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X