న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రంజీల్లో యువ పేసర్ అరుదైన ఘనత: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు

Indian teenager takes all 10 wickets in an innings

హైదరాబాద్: రంజీ క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదైంది. మణిపూర్‌కు చెందిన 18 ఏళ్ల రెక్స్ రాజ్‌కుమార్ సింగ్ అనే యువ క్రికెటర్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజ్‌కుమార్ సింగ్ ఈ ఘనత సాధించాడు.

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‌లో మణిపూర్ జట్టు తరుపున అరంగేట్రం చేసిన రాజ్‌కుమార్ సింగ్ మొత్తం 9.5 ఓవర్లు వేసి 11 పరుగులిచ్చి ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. ఇందులో ఆరు ఓవర్లు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం.

138 పరుగులు చేసి ఆలౌటైన అరుణాచల్ ప్రదేశ్

138 పరుగులు చేసి ఆలౌటైన అరుణాచల్ ప్రదేశ్

అనంతపుర్‌లోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో జరిగిన నాలుగు రోజుల టోర్నమెంట్‌లో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 54.5 ఓవర్లకు గాను 138 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం మణిపూర్ జట్టు 49.1 ఓవర్లలో 122 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు రాజ్‌కుమార్ దెబ్బకు 18.5 ఓవర్లలో 36 పరుగులకే కుప్పకూలింది.

 ఒక ఓవర్‌లో ఐదు వికెట్లు

ఒక ఓవర్‌లో ఐదు వికెట్లు

ఈ మ్యాచ్‌లో రాజ్‌కుమార్ సింగ్ ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీయడం విశేషం. ఇందులో రెండు ఎల్బీలు కాగా, మరో రెండు క్యాచ్‌లు కాగా మరొకటి బౌల్డ్. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి రాజ్‌కుమార్ 15 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 55 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపూర్ జట్టు వికెట్ కోల్పోకుండా 7.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించడం విశేషం.

కేవలం ఇద్దరు బౌలర్లు మాత్రమే

కేవలం ఇద్దరు బౌలర్లు మాత్రమే

అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం ఇద్దరు బౌలర్లు మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశారు. అందులో ఒకరు టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కాగా, మరొకరు ఇంగ్లాండ్‌కు చెందిన జిమ్ లేకర్. 1999 జనవరి నెలలో భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ జట్టు రెండు టెస్టుల్లో తలపడింది. జనవరి 28 నుంచి 31 వరకు చెన్నైలో జరిగిన తొలి టెస్టులో 12 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది.

 తప్పక గెలవాల్సిన మ్యాచ్

తప్పక గెలవాల్సిన మ్యాచ్

రెండో టెస్ట్ ఫిబ్రవరి 4న ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల స్టేడియంలో ప్రారంభమైంది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే అనిల్ కుంబ్లే (4 వికెట్లు), హర్భజన్ (3 వికెట్లు) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 172కే చాపచుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేసిన భారత్.. పాక్ ముందు 420 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

10/74 గణాంకాలతో చరిత్ర సృష్టించిన కుంబ్లే

10/74 గణాంకాలతో చరిత్ర సృష్టించిన కుంబ్లే

రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 101 పరుగుల వద్ద షాహిద్ అఫ్రిదిని ఔట్ చేసి అనిల్ కుంబ్లే తన దండయాత్రను మొదలుపెట్టాడు. వరసపెట్టి వికెట్లు తీస్తూ 207 పరుగులకే పాక్‌ను కుప్పకూల్చాడు. భారత్‌కు 212 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. 10/74 గణాంకాలతో చరిత్ర సృష్టించాడు.

Story first published: Wednesday, December 12, 2018, 15:34 [IST]
Other articles published on Dec 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X