న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లేడు: సచిన్‌కు ఒక రూల్... ధోని ఒక రూలా?

Indian Team Has No Viable Alternative To MS Dhoni, Says Former National Selector Sanjay Jagdale

హైదరాబాద్: వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా టీమిండియాలో ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు లేడని బీసీసీసీ మాజీ కార్యదర్శి, మాజీ సెలెక్టర్‌ సంజయ్‌ జగ్‌డాలే అభిప్రాయపడ్డాడు. జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆడిన ధోనికి రిటైర్‌మెంట్‌ విషయంలో పూర్తి స్వేచ్చనివ్వాలని పేర్కొన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత ధోనిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ జగ్దాలే ధోనీకి అండగా నిలిచాడు. శుక్రవారం పీటీఐతో మాట్లాడిన సంజయ్ జగ్దాలే అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలో ధోని తెలుసని చెప్పుకొచ్చాడు.

"నా దృష్టిలో ధోని గొప్ప ఆటగాడు. తను దేశం కోసం ఆడాడు. ఒక వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌గా ధోని స్థానాన్ని భర్తీ చేయగల, అతడికి ప్రత్యామ్నాయం కాగల ఆటగాడు ప్రస్తుత జట్టులో లేడు. ఇక రిటైర్‌మెంట్‌ గురించి సరైన సమయంలో నిర్ణయం తీసుకోగల పరిణతి ధోనికి ఉంది. తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి సెలక్టర్లు అతడితో మాట్లాడితే బాగుంటుంది" అని అన్నాడు.

సచిన్‌ సెలక్టర్లు ఎలా

సచిన్‌ సెలక్టర్లు ఎలా

"రిటైర్‌మెంట్‌కు ముందు సచిన్‌ టెండూల్కర్‌ విషయంలో సెలక్టర్లు ఎలా వ్యవహరించారో ధోని విషయంలో కూడా అదే పంథా అనుసరించాలి. ధోనీ 38 ఏళ్ల వయసులో మునుపటిలా ఆడాలనుకోవడం సరికాదు. తమ కెరీర్‌లో సరిగ్గా ఆడని క్రికెటర్లు సైతం అతడిని విమర్శిస్తున్నారు. నిజమైన ఆటగాళ్లకే ధోనీ విలువ తెలుస్తుంది" అని తెలిపాడు.

ధోని రనౌట్‌ కావడం

ధోని రనౌట్‌ కావడం

వరల్డ్‌కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని రనౌట్‌ కావడం గురించి సంజయ్‌‌ను ప్రశ్నించగా "జట్టు ప్రయోజనాలకు, పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచకప్‌లో ధోని శక్తి మేరకు రాణించాడు. సెమీ ఫైనల్‌లో కూడా అతడు వ్యూహాత్మకంగానే మైదానంలోకి దిగాడు. అయితే దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. ఆ ఒక్క కారణంగా ధోని ఆట ముగియాలనుకోవడం సరైంది కాదు" అని అన్నాడు.

ధోని విలువ వారికి తెలియకపోయినా

ధోని విలువ వారికి తెలియకపోయినా

ధోని విలువ వారికి తెలియకపోయినా భవిష్యత్‌ తరం ఆటగాళ్లు మాత్రం ఈ విషయాన్ని తప్పక గుర్తిస్తారని జగ్దాలే పేర్కొన్నాడు. యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ను ప్రపంచకప్‌ ముందు జట్టులో ఆడిస్తే... అతడు ధోనీతో కలిసి ఆడి ఉంటే ఎంతో నేర్చుకునేవాడని సంజయ్ జగ్దాలే వెల్లడించాడు.

వెస్టిండీస్‌ పర్యటన కోసం టీమిండియా

వెస్టిండీస్‌ పర్యటన కోసం టీమిండియా

ఆదివారం వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో సెలక్టర్లు సమావేశమవుతున్నారు. దీంతో ధోనిని ఎంపిక చేస్తారా లేదా విశ్రాంతినిస్తారా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి కొంత కాలం క్రికెట్‌ ఆడటానికి ధోని ఇష్టపడుతుండటంతో ధోనిపై సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Story first published: Saturday, July 20, 2019, 11:57 [IST]
Other articles published on Jul 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X