న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India: ఐపీఎల్ ఆడితే బౌలింగ్ వేగం పడిపోతోంది.. భారత పేసర్లపై మాజీ లెజెండ్ అసహనం

Indian pacers drop their speed after playing IPL says legendary pacer

టీమిండియాకు చాలా కాలంగా ఇబ్బందిగా మారిన విభాగం ఏదైనా ఉందంటే అది పేస్ బౌలింగే. ఇటీవల బుమ్రా, షమీ వంటి వారితో పేస్ బౌలింగ్ విభాగం కళకళలాడుతున్నప్పటికీ..

ఈ బృందంలో వేగం కొరవడిందనే మాట నిజం. భారత బౌలర్లు అంతర్జాతీయ స్థాయిలో సగటున 130-135 కిలోమీటర్ల వేగంతోనే బౌలింగ్ చేస్తారు. అదే సమయంలో మిగతా జట్ల బౌలర్లు 150 కిలోమీటర్ల వేగం అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

భారత్‌కు పేసర్ల తిప్పలు..

భారత్‌కు పేసర్ల తిప్పలు..

భారత జట్టులో సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రమే దగ్గరదగ్గరగా 140 కిలోమీటర్ల సగటు వేగాన్ని మెయిన్‌టైన్ చేస్తున్నాడు. మిగతా వాళ్లంతా 130లలోనే ఉన్నారు. యువబౌలర్లు కూడా వేగంగా బౌలింగ్ చేయడం లేదు. ప్రస్తుతం భారత దేశంలో ఫాస్ట్ బౌలింగ్ అంటే గుర్తొచ్చేది కేవలం ఉమ్రాన్ మాలిక్ మాత్రమే. అతను కూడా 150 కిలోమీటర్ల వేగాన్ని తగ్గించేసుకొని, 140 కిలోమీటర్ల వేగంతోనే బౌలింగ్ చేయడం మొదలు పెట్టడం గమనార్హం.

ఐపీఎల్ ఆడితే పడిపోతున్న వేగం

ఐపీఎల్ ఆడితే పడిపోతున్న వేగం

ఈ విషయంతో పేస్ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రమ్ స్పందించాడు. ఐపీఎల్ మొదలైన తర్వాత భారత జట్టు ఒక్క టీ20 ప్రపంచకప్ కూడా గెలవలేదని చెప్పిన అక్రమ్.. భారత బౌలర్లు ఐపీఎల్ ఆడితే వారి వేగం పడిపోతోందని చెప్పాడు. 'ఆవేశ్ ఖాన్‌ను చూడండి. అతను 140-145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆ స్పీడ్ 130-135 కిలోమీటర్లకు పడిపోయింది' అన్నాడు. ఏటా రూ.24 కోట్ల వరకు సంపాదిస్తుంటే అంత కష్టపడాల్సిన అవసరం ఏముంటుందన్నాడు.

బీసీసీఐకి సూచన

బీసీసీఐకి సూచన

ఇలా ఐపీఎల్ ఆడిన తర్వాత బౌలర్ల వేగం ఎందుకు పడిపోతుందో బీసీసీఐ గుర్తించాలని అక్రమ్ సూచించాడు. అలాగే ఆట మీద ఆకలి ఎలా ఉంటుందో యువప్లేయర్లకు తెలిసేలా చూడాలని, అవసరం అయితే ఐపీఎల్‌లో వారి ధరకు ఒక పరిమితి విధించాలని సలహా ఇచ్చాడు. మరి ఇప్పటికైనా కళ్లు తెరుచుకొని భారత బౌలింగ్ విభాగాన్ని బీసీసీఐ బలోపేతం చేస్తుందేమో చూడాలి.

Story first published: Saturday, November 12, 2022, 12:59 [IST]
Other articles published on Nov 12, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X