న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రోహిత్‌ను చూస్తుంటే సెహ్వాగ్ కనిపిస్తున్నాడు'

Virender Sehwag Asks Why Did Drop Rohit Sharma From Test Team Earlier? | Oneindia Telugu
India vs Windies | Rohit Sharma has been standout performer in both ODIs and T20Is, says Sunil Gavaskar

హైదరాబాద్: భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు ఇప్పటికే రెండు ఫార్మాట్లలోనూ పరాజయం మూటగట్టుకుంది. ఈ క్రమంలో మూడో ఫార్మాట్ టీ20లోనూ దాదాపు టైటిల్‌ను దాదాపు ఖాయం చేసేసుకుంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ విరామంలో ఉండడంతో తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు మోస్తూనే బ్యాట్స్‌మన్‌గానూ ఇరగదీస్తున్నాడు. విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో రోహిత్‌ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు.

జోరు అందుకుంటే ఆపడం కష్టం

జోరు అందుకుంటే ఆపడం కష్టం

ఫుల్‌ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను చూస్తుంటే అతనిలో నాకు సెహ్వాగ్‌ కనిపిస్తున్నాడు. ఒక్కసారి జోరు అందుకున్నాడంటే అతనిని ఆపడం చాలా కష్టం. సాధారణంగా సెహ్వాగ్‌ బంతిని బౌండరీకి తరలించాక.. మరో భారీ షాట్‌ కొట్టే ముందు ఒకసారి మైదానాన్ని గమనించేవాడు. రోహిత్‌ మాత్రం సులభంగా పని పూర్తి చేస్తాడు. అతను టెస్టుల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తే.. సంప్రదాయ క్రికెట్‌లో వివ్‌ రిచర్డ్స్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ తర్వాత అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందుతాడు.

 జోరు కొనసాగించి 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయాలని

జోరు కొనసాగించి 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయాలని

మరోవైపు భారత జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. చెన్నై మ్యాచ్‌లోనూ భారత్‌ ఇదే జోరు కొనసాగించి 3-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోందని అన్నాడు. రెండు ఫార్మాట్లను దక్కించుకుని మూడో ఫార్మాట్‌ను చేజిక్కుంచుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని వెస్టిండీస్ ప్రయత్నిస్తోంది.

చివరి మ్యాచ్‌లోనైనా కనీస పోటీ

చివరి మ్యాచ్‌లోనైనా కనీస పోటీ

మొత్తంగా చూసుకుంటే వెస్టిండీస్‌కు ఈ పర్యటన మర్చిపోలేనిదిగా మిగిలిపోయేలా ఉంది. అయితే చివరి మ్యాచ్‌లోనైనా వారి నుంచి కనీస పోటీ వస్తుందో లేదో చూడాలి. టీమిండియా ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతుంటే.. విండీస్‌ ఆటగాళ్ల నుంచి కనీస ప్రతిఘటన కూడా రావడం లేదు.

చాహల్‌ తన వ్యూహాలతో సిద్ధంగా

చాహల్‌ తన వ్యూహాలతో సిద్ధంగా

చివరి మ్యాచ్‌లో కుల్దీప్‌కు విశ్రాంతినివ్వడంతో చాహల్‌కు మంచి అవకాశం దొరికినట్లయింది. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌కు కట్టడి చేసేందుకు చాహల్‌ తన వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాడు.

Story first published: Sunday, November 11, 2018, 15:04 [IST]
Other articles published on Nov 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X