న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 
క్రికెట్‌లో ఇదో మంచి గేమ్: విశాఖ వన్డే ఫలితంపై విరాట్ కోహ్లీ

India vs West Indies: Virat Kohli feels tie was a fair result in Vizag ODI

హైదరాబాద్: వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్నందుకు చాలా గర్వంగా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే. చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు నిరాశే మిగిలింది.

1
44267
50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు

50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు

322 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. ఓపెనర్లు కీరన్ పావెల్(18), హేమ్ రాజ్(32) చక్కటి శుభారంభాన్నిచ్చారు.

అఖరి బంతికి ఐదు పరుగులు

అఖరి బంతికి ఐదు పరుగులు

విండిస్ జట్టులో హెట్‌మెయిర్(94), హోప్‌(123 నాటౌట్‌) భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో విండిస్ విజయానికి అఖరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో హోప్‌ ఫోర్‌ కొట్టడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "వ్యక్తిగతంగా నా ఇన్నింగ్స్‌ పట్ల, వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్నందుకు గర్వంగా ఉంది" అని అన్నాడు.

వెస్టిండిస్ ఆటగాళ్లు చాలా గొప్పగా పోరాడారు

వెస్టిండిస్ ఆటగాళ్లు చాలా గొప్పగా పోరాడారు

"క్రికెట్‌లో ఇదో మంచి గేమ్. మ్యాచ్‌ గొప్పగా సాగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ ఆటగాళ్లు చాలా గొప్పగా పోరాడారు. మూడు వికెట్లు పడినా.. హోప్, హెట్మెయర్ ఆడిన తీరు అద్భుతం. మాకు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ చాలా మారిపోయింది. 275, 280 పరుగులే గొప్ప లక్ష్యం అనుకున్నాం. మేం ఎక్స్‌ట్రాగా పరుగులు చేసినా గెలువలేకపోయాం" అని కోహ్లీ అన్నాడు.

అదృష్టవశాత్తు మ్యాచ్‌ను టై చేసుకోగలిగాం

అదృష్టవశాత్తు మ్యాచ్‌ను టై చేసుకోగలిగాం

"అదృష్టవశాత్తు మ్యాచ్‌ను టై చేసుకోగలిగాం. కుల్దీప్, చాహల్, ఉమేశ్, షమీ మెరుగ్గా బౌలింగ్ చేశారు. కానీ చివరి ఏడు ఓవర్లలో మ్యాచ్ అద్భుతంగా సాగింది. టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని మ్యాచ్‌కు ముందే నిర్ణయించాం. ఎందుకంటే వేడి, తేమ వాతావరణంలో భారీ స్కోరు చేయాలి. వరల్డ్‌కప్‌లో ఇది ఉపయోగపడుతుంది. అంబటి రాయుడు చాలా బాగా ఆడాడు" అని కోహ్లీ తెలిపాడు.

Story first published: Thursday, October 25, 2018, 15:02 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X