న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs West Indies: ఆంటిగ్వాలో అశ్విన్ రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా

IND V WI 2019, 1st Test : Jasprit Bumrah Becomes The Fastest Indian To Scalp 50 Test Wickets
 India vs West Indies: Jasprit Bumrah fastest Indian pacer to 50 Test wickets

హైదరాబాద్: ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్ తరుపున అతి తక్కువ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు సాధించిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు.

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం డారెన్ బ్రావో‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా టెస్టుల్లో 50 వికెట్‌ను తీశాడు. బుమ్రా కేవలం 11 టెస్టుల్లోనే ఈ రికార్డుని అందుకున్నాడు.

<strong>PKL 2019: సొంతగడ్డపై నిరాశపరిచిన తమిళ తలైవాస్, మూడో జట్టుగా రికార్డు</strong>PKL 2019: సొంతగడ్డపై నిరాశపరిచిన తమిళ తలైవాస్, మూడో జట్టుగా రికార్డు

50 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్‌ బౌలర్‌గా

దీంతో పాటు 50 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్‌ బౌలర్‌గా బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు వెంకటేష్‌ ప్రసాద్‌, మహ్మద్‌ షమీ పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డుని సైతం బుమ్రా బద్ధలు కొట్టాడు. వీరిద్దరూ 13వ టెస్టులో 50వ టెస్టు వికెట్‌ను సాధించారు. ఇదిలా ఉంటే, తొలి టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది.

జడేజా హాఫ్ సెంచరీ

జడేజా హాఫ్ సెంచరీ

రెండో రోజు ఆటలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(58) హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 297 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను ఇషాంత్‌ శర్మ గడగడలాడించాడు. త‌న బౌలింగ్‌తో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు.

108 పరుగుల ఆధిక్యంలో భారత్

108 పరుగుల ఆధిక్యంలో భారత్

ఈ క్రమంలో ఇషాంత్ శర్మ(5/42) అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో 5 వికెట్లు తీసుకోవ‌డం ఇషాంత్‌కు ఇది తొమ్మిద‌వ సారి. విండిస్ బ్యాట్స్‌మన్ ఛేజ్‌(48) ఆకట్టుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి విండీస్‌ 59 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్‌ 108 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 297 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, August 24, 2019, 11:26 [IST]
Other articles published on Aug 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X