న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లక్నోలో రెండో టీ20: స్వల్ప మార్పులతో బరిలోకి రోహిత్ సేన?

India vs West Indies: India may rework its combination

హైదరాబాద్: రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు మరో సరిస్‌పై కన్నేసింది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండో టీ20 లక్నో వేదికగా మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

టీ20కి ఒక్కరోజు ముందే స్టేడియం పేరు మార్చారు..టీ20కి ఒక్కరోజు ముందే స్టేడియం పేరు మార్చారు..

ఈ సిరిస్‌ సాధించడమే లక్ష్యంగా టీమిండియా దూసుకుపోతోంది. దీంతో రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ నెగ్గాలని ఊవిళ్లూరుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో అలవోకగా నెగ్గాల్సిన టీమిండియా చివరి వరకు పోరాడి విజయాన్ని సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది.

1
44272
రెండో టీ20లో స్వల్ప మార్పులు

రెండో టీ20లో స్వల్ప మార్పులు

దీంతో రెండో టీ20లో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అయితే, బ్యాట్స్‌మన్ మాత్రం నిరాశపరిచారు. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ విఫలమైన సంగతి తెలిసిందే.

స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో చెమటోడ్చిన భారత్

స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో చెమటోడ్చిన భారత్

దీంతో వెస్టిండిస్ నిర్దేశించిన 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం చేధించడానికి చెమటోడ్చింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే, దినేష్ కార్తీక్ బాధ్యతాయుతంగా ఆడి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. బౌలింగ్‌లో ఆకట్టుకున్న కృనాల్ పాండ్యా బ్యాటింగ్‌లోనూ చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు.

స్టేడియం పేరు మార్పు

స్టేడియం పేరు మార్పు

దీంతో రెండో టీ20లో స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి టీ20లో నిరాశపరిచిన రిషబ్ పంత్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా సదరు స్టేడియం పేరు సోమవారం సాయంత్రమే మార్చేశారు. అంతకుముందు స్టేడియం పేరు ఎకనా అంతర్జాతీయ స్టేడియంగా ఉండేది. ఇప్పుడు కాస్తా.. దానిని దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరుమీదుగా మార్చారు.

రెండో టీ20కి భారత జట్టు అంచనా :

రెండో టీ20కి భారత జట్టు అంచనా :

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కె ఎల్ రాహుల్, మనీష్ పాండే, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ,ఉమేశ్, బుమ్రా, ఖలీల్ అహ్మద్

Story first published: Tuesday, November 6, 2018, 16:52 [IST]
Other articles published on Nov 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X