న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖ వన్డేతో టీమిండియా ఖాతాలో రికార్డు: కోహ్లీసేన బ్యాటింగ్, కుల్దీప్‌కు చోటు

India vs West Indies, 2nd ODI: India Win Toss, Elect To Bat

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మైదానంలో ఇప్పటి వరకు 8 వన్డేలాడిన భారత్ జట్టు ఏకంగా ఆరింట్లో గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓడింది. అది కూడా వెస్టిండీస్ చేతిలో. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు.

భారత తుది జట్టులో కెప్టెన్ కోహ్లి ఒక మార్పు చేశాడు. ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్‌ని తప్పించి.. అతని స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని జట్టులోకి తీసుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉన్నదని, పైగా తమ బౌలింగ్ టార్గెట్‌ను డిఫెండ్ చేయగలిగేలా ఉందని కోహ్లి చెప్పాడు. దీంతో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌తో ఈ మ్యాచ్‌లో భారత్ బరిలోకి దిగుతోంది.

1
44267

ఒక మార్పుతో బరిలోకి దిగిన వెస్టిండిస్

మరోవైపు వెస్టిండిస్ జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆ జట్టు తరుపున ఒబెద్ మెక్‌కాయ్ అరంగేట్రం చేస్తున్నాడు. థామస్ స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో సునాయాసంగా గెలిచిన కోహ్లీ సేన.. ఇప్పుడు అచ్చొచ్చిన వైజాగ్ మైదానంలో జోరు కొనసాగించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.

నాలుగు వన్డేలాడిన కోహ్లీ ఏకంగా 399 పరుగులు

నాలుగు వన్డేలాడిన కోహ్లీ ఏకంగా 399 పరుగులు

మరోవైపు వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేయాల్సిన పరుగులు 81 కాగా.. ఈ మైదానంలో ఇప్పటి వరకు నాలుగు వన్డేలాడిన కోహ్లీ ఏకంగా 399 పరుగులు చేశాడు. ఇందులో 118, 117, 99, 65 రూపంలో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

టీమిండియాకిది 950వ వన్డే మ్యాచ్‌

కాగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియాకిది 950వ వన్డే మ్యాచ్‌ కావడం విశేషం. దీంతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లాడిన జట్టుగా భారత్‌ అరుదైన ఘనత వహించింది. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్‌లో 949మ్యాచ్‌లాడిన భారత్‌.. 490మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 411మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇక భారత్‌ తర్వాత 916 వన్డేలాడి ఆసీస్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది.

556విజయాలతో ముందంజలో ఆస్ట్రేలియా

గెలుపు-ఓటమిల పరంగా చూసుకుంటే మాత్రం ఈ ఫార్మాట్‌లో మొత్తం 556విజయాలతో ఆస్ట్రేలియానే ముందంజలో ఉంది. ఆస్ట్రేలియా కేవలం 317 మ్యాచ్‌లలో మాత్రం ఓటమిపాలైంది. మరోవైపు వన్డేల్లో అత్యధిక మ్యాచ్‌లాడిన జట్ల జాబితాలో మూడో స్థానంలో పాకిస్థాన్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 899 వన్డే మ్యాచ్‌లాడిన పాక్‌.. 476 విజయాలు, 397 పరాజయాలు చవిచూసింది. నాలుగో స్థానంలో శ్రీలంక(827), ఐదో స్థానంలో వెస్టిండీస్‌(781) కొనసాగుతున్నాయి.

భారత్ తుది జట్టు:

విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ

Story first published: Wednesday, October 24, 2018, 13:35 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X