న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కతా టెస్టు, డే 3: ముగిసిన ఆట... భారత్ 172 ఆలౌట్, శ్రీలంక 165/4

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 74/5తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌కు శ్రీలంక బౌలర్ ఆదిలోనే భారత్‌కు షాకిచ్చాడు.

By Nageshwara Rao
Kohli

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 172 పరుగులు చేసి ఆలౌటైంది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఓపెనర్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా.. మాజీ కెప్టెన్ మాథ్యూస్(52), తిరుమన్నే(51) నిలకడగా ఆడారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. కాగా, వెలుతురులేని కారణంగా ఆంపైర్లు మూడో రోజు ఆటని నిలిపివేశారు. ఆ సమయానికి లంక 45.4 ఓవర్లకి 165 పరుగులు చేసింది.

ప్రస్తుతం క్రీజ్‌లో కెప్టెన్ చంఢిమాల్(13), డిక్వెలా(14) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై ఆధిక్యం సాధించాలంటే శ్రీలంక ఇంకా 7 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లలో భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

మూడో వికెట్ కోల్పోయిన లంక: మాథ్యూస్ హాఫ్ సెంచరీ
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. లంక క్రికెటర్లు తిరమన్నే(51), ఏంజెలో మాథ్యూస్‌ (52) నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ముఖ్యంగా భారత బౌలింగ్‌‌ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలో 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తిరమన్నేను ఉమేష్ యాదవ్ పెవిలియన్ పంపించాడు. ఉమేష్ వేసిన 36 ఓవర్ తొలి బంతికే థర్డ్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

దీంతో 37 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 172ను అందుకోవడానికి శ్రీలంకకు ఇంకా 34 పరుగులు చేయాలి. ప్రస్తుతం క్రీజులో ఏంజెలో మాథ్యూస్‌ (52), చండీమాల్ 1 పరుగుతో ఉన్నారు.

 Kolkata Test, Day 3

టీ విరామానికి శ్రీలంక 113/2
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీ విరామ సమయానికి శ్రీలంక 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. లంక ఓపెనర్లు తక్కువ స్కోరుకే అవుటైనప్పటికీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌(32)తో కలిసి తిరిమన్నే జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో తిరుమన్నే హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

81 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. వీరిద్దరూ 146 బంతుల్లో 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఇంకా 59 పరుగుల వెనుకంజలో ఉంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 172 పరుగులకే ఆలౌట్ అయింది.

చెలరేగిన భువీ: శ్రీలంక ఓపెనర్లు ఔట్
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్న్‌లో శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయింది. ఐదు పరుగుల వ్యవధిలోనే లంక ఓపెనర్లు కరుణరత్నె (8), సమర విక్రమ (23)లను భువనేశ్వర్‌ పెవిలియన్‌ పంపించాడు. ముందుగా 4.5వ బంతికి కరుణరత్నెను ఔట్ చేసిన భువీ... ఆ తర్వాత 6.4వ బంతికి సమరవిక్రమను ఔట్‌ చేశాడు. 13 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం తిరుమన్నే 8, మాథ్యూస్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న శ్రీలంక ఓపెనర్లు
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత బౌలర్ భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతినే బౌండరీ తరలించిన సమరవిక్రమ దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ కరుణరత్నే ఆచితూచి ఆడుతున్నాడు. ప్రస్తుతం శ్రీలంక 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. సమరవిక్రమ 20, కరుణరత్నే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Saha

భారత్ 172 ఆలౌట్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్పల్ప స్కోరుకే ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 74/5తో మూడో రోజు ఆట కొనసాగించిన టీమిండియా 172 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లు విజృంభించడంతో భారత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే పుజారా (52) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా-సాహా జోడి ఆచితూచి నెమ్మిదిగా ఆడుతూ పరుగులు పెంచే ప్రయత్నిం చేశారు. అయితే వీరిద్దరిని శ్రీలంక స్పిన్నర్ పెరీరా వీరిద్దరినీ ఒకే ఓవర్‌లో అవుట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు.

వీరిద్దరూ ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. చివర్లో షమీ (24), భువనేశ్వర్ కుమార్ (13) పరుగులు చేయడంతో స్కోరుబోర్డు కాస్త కోలుకుంది. ఉమేష్ యాదవ్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బ్యాట్స్‌మెన్లలో సాహా 29, జడేజా 22, మహ్మద్ శమీ 24, కుమార్ 13, ధవాన్ 8 పరుగులు చేశారు శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్ 4, గేమాజ్, షనకా, పెరీరా తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయి భారత్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోరు 74/5తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న జడేజాను, ఆచితూచి ఆడుతున్న సాహాను శ్రీలంక స్పిన్నర్ పెరీరా పెవిలియన్‌కు చేర్చాడు.

ఇన్నింగ్స్ 52 ఓవర్ వేసిన పెరీరా రెండో బంతికి జడేజాను, ఐదో బంతికి సాహాను పెవిలియన్‌కు పంపాడు. జడేజా 37 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ సాయంతో 22 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 83 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 29 పరుగులు చేశాడు.

వీరిద్దరూ ఏడో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 54 ఓవర్లు గాను టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ 10, మహమ్మద్ షమీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

India Vs Sri Lanka, Kolkata Test, Day 3, Live: Cheteshwar Pujara falls after gritty fifty


హాఫ్‌సెంచరీ తర్వాత పుజారా ఔట్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 74/5తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌కు శ్రీలంక బౌలర్ ఆదిలోనే భారత్‌కు షాకిచ్చాడు. ఛటేశ్వర్ పుజారా 117 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

భారత్ Vs శ్రీలంక తొలి టెస్టు స్కోరుకార్డు

ఈ క్రమంలో శ్రీలంక బౌలర్ గమగె వేసిన 37.2వ బంతికి అనూహ్యంగా క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా గత రెండు రోజులుగా పుజారా ఒంటరి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో రోజైన శనివారం పుజారా 52 పరుగులు చేసి వెనుదిరిగాడు.

పుజారా అవుటైన తర్వాత క్రీజులోకి జడేజా వచ్చాడు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా (16) నిలకడగా ఆడుతున్నాడు. 41 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ప్రస్తుతం సాహా 16, జడేజా ఒక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో ఆట సవ్యంగా సాగని సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, November 18, 2017, 16:33 [IST]
Other articles published on Nov 18, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X