న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20: కుమార సంగక్కర రికార్డుని బద్దలు కొట్టిన ధోని

By Nageshwara Rao
India vs South Africa: MS Dhoni surpasses Kumar Sangakkara to bag major milestone in T20Is

హైదరాబాద్: జోహెన్స్‌బర్గ్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి టీ20లో సఫారీ ఆటగాడు హెండిక్స్ (70) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువీ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

దీంతో హెండ్రిక్స్ క్యాచ్ అందుకోవడం ద్వారా ధోని టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లను అందుకున్న వికెట్ కీపర్‌గా సంగక్కర పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 194 ఇన్నింగ్స్‌ల్లో 133 క్యాచ్‌లు పట్టగా.. ధోని 262 ఇన్నింగ్స్‌ల్లో 134 క్యాచ్‌లు పట్టాడు.

భారత్‌కు చెందిన మరో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కార్తీక్ 196 ఇన్నింగ్స్‌ల్లో 123 క్యాచ్‌లు పట్టాడు. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్‌కు కమ్రాన్ అక్మల్ (203 మ్యాచ్‌ల్లో 115), వెస్టిండిస్‌కు చెందిన రామ్‌దిన్ (166 ఇన్నింగ్స్‌ల్లో 108), భారత్‌కు చెందిన నమాన్ ఓజా (166 ఇన్నింగ్స్‌ల్లో 106 క్యాచ్‌లు) ఉన్నారు.

కాగా, తొలి టీ20లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే కుప్పకూలింది. ఛేజింగ్‌కు అనుకూలించే పిచ్ మీద కోహ్లి సేన చరిత్ర సృష్టించింది.

టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్లు:
* 134 MS Dhoni (262 innings)
* 133 K Sangakkara (194)
* 123 D Karthik (196)
* 115 Kamran Akmal (203)
* 108 D Ramdin (166)
* 106 Naman Ojha (166)

Story first published: Monday, February 19, 2018, 9:57 [IST]
Other articles published on Feb 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X