న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: పుజారాకు ఏమైంది? గత 5 ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు ఇలా!

India vs South Africa: Cheteshwar Pujara falls for 6, check out his dismissals in last 5 innings

హైదరాబాద్: ఛటేశ్వర్ పుజారా అనే పేరు వినగానే ఠక్కున టెస్టు క్రికెట్ గుర్తుకు వస్తుంది. 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియాకు దొరికిన మరో 'వాల్'గా అభిమానులు పరిగణిస్తున్నారు. టెస్టుల్లో No.3 స్థానానికి తాను మాత్రమే న్యాయం చేయగలడు.

ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్‌లో అదే స్థాయిలో రాణించి ఆసీస్ గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, ఈ మధ్య కాలంలో పుజారా ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోవడం లేదు. విండిస్ పర్యటనలో సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.

తాజాగా, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పుజారా(6) నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో పుజారా గత ఐదు ఇన్నింగ్స్‌లను ఒకసారి పరిశీలిద్దాం...

6 vs వెస్టిండిస్, ఆంటిగ్వా

6 vs వెస్టిండిస్, ఆంటిగ్వా

సఫారీలతో సొంతగడ్డపై జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ ముందు టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లింది. విండిస్ పర్యటనలో సైతం పుజారా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆంటిగ్వా వేదికగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఔటయ్యాడు.

27 vs వెస్టిండిస్, ఆంటిగ్వా

27 vs వెస్టిండిస్, ఆంటిగ్వా

రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి శుభారంభాన్ని ఇచ్చాడనుకునే లోపే కెప్టెన్ జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో పుజారా ఔటయ్యాడు. థర్డ్ స్లిప్‌లో బ్రూక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

2 vs వెస్టిండిస్, జమైకా

2 vs వెస్టిండిస్, జమైకా

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు జమైకా వేదికగా జరిగింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 2 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. కీమర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ షాయ్ హోప్‌కు ఓ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పుజారా నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.

25 vs వెస్టిండిస్, జమైకా

25 vs వెస్టిండిస్, జమైకా

రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలో పుజారా కొద్దిసేపు నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, కీమర్ రోచ్ విసిరిన లెంత్ బాల్ నేరుగా వికెట్లను గిరాటేసింది. పుజారా ఢిపెన్స్‌ను దాటుకుని మరీ బంతి వికెట్లను గిరాటేయడం చాలా అరుదుగా జరుగుతుంది.

6 vs దక్షిణాఫ్రికా, విశాఖపట్నం

6 vs దక్షిణాఫ్రికా, విశాఖపట్నం

విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పుజారా ఆట ఆరంభం నుంచీ తడబాటుగానే సాగింది. సఫారీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్ విసిరిన అంచనా వేయడంలో పుజారా పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో జట్టు స్కోరు 324 పరుగుల వద్ద పుజారా(6) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

కాగా, ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(215) డబుల్ సెంచరీతో చెలరేగగా, రోహిత్ శర్మ(176) సెంచరీతో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం 127 ఓవర్లకు గాను టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 457 పరుగులు చేసింది. జడేజా(11), సాహా పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

Story first published: Thursday, October 3, 2019, 15:38 [IST]
Other articles published on Oct 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X