న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విచిత్ర సంఘటనల వల్ల మ్యాచ్‌ల్ని నిలిపేసిన సందర్భాలను చూద్దామా!

India vs New Zealand: Not rain, not bad light. Sun stops play in Napier!

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు వర్షం, వెలుతురులేమి కారణంగా అనేక మ్యాచ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, బుధవారం నేపియర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే సూర్యుడి కారణంగా మ్యాచ్ నిలిచింది. భోజన విరామం తర్వాత మైదానంలోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్‌ అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలను తట్టుకోలేకపోయారు.

<strong>న్యూజిలాండ్ పర్యటనలో భారత్ బోణీ: తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం</strong>న్యూజిలాండ్ పర్యటనలో భారత్ బోణీ: తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం

సూర్యుడి కిరణాలు నేరుగా కళ్లలోకి పడటంతో బ్యాటింగ్ చేస్తున్న శిఖ‌ర్ ధావ‌న్ అంపైర్ల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ను 30 నిమిషాలు పాటు నిలిపి వేశారు. సూర్యుడి కారణంగా మ్యాచ్ నిలిచిపోవడం... ఇది మనకు కొత్తగా అనిపించినా.. ఈ క్రికెట్ మైదానంలో ఇలా జరగడం మామూలే అని అంటున్నారు.

అందుకు కారణం లేకపోలేదు. సాధారణంగా అన్ని దేశాల మైదానాల్లో పిచ్‌లు ఉత్తర, దక్షిణ అభిముఖంగా ఉంటాయి. నేపియర్‌లో మాత్రం తూర్పు, పడమర ముఖంగా ఉంటాయి. దీంతో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో బ్యాట్స్‌మెన్‌ బంతులను ఎదుర్కోవడం కష్టం. ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి విచిత్ర సంఘటనల వల్ల మ్యాచ్‌ల్ని నిలిపేసిన సందర్భాలను ఒక్కసారి పరిశీలిస్తే...

సూర్య గ్రహణంతో మ్యాచ్ రెస్ట్ డే

సూర్య గ్రహణంతో మ్యాచ్ రెస్ట్ డే

బీసీసీఐ స్వర్ణోత్సవం సందర్భంగా 1980లో ముంబైలో ఇంగ్లాండ్‌-భారత్‌ జట్ల మధ్య ప్రత్యేక టెస్టుని నిర్వహించారు. రెండో రోజు సంపూర్ణ సూర్య గ్రహణం ఉండటంతో ఆటను పూర్తిగా నిలిపివేశారు. తొలి రోజు ఇయాన్‌ బోథమ్‌ 6/58తో అద్భుత ప్రదర్శన చేశాడు. రెండోరోజు విశ్రాంతి లభించడంతో సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.

బంతిని వేడి చేసేందుకు

బంతిని వేడి చేసేందుకు

పార్ల్‌ వేదికగా 1995లో కర్రీకప్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ సిక్సర్‌ బాదడంతో బంతి గ్రిల్స్‌లో ఇరుక్కుపోయింది. దానికి ఉన్న గ్రీజును త్వరగా పోగొట్టేందుకు బంతిని వేడిచేశారు. అప్పటి వరకు మ్యాచ్‌ ని అంఫైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు.

ముళ్లపంది అడ్డంకి

ముళ్లపంది అడ్డంకి

గ్లూసెస్టర్‌లో 1957, జులైలో ముళ్లపంది వల్ల డెర్బీషైర్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను కాసేపు నిలిపివేశారు. పిచ్‌పై పరుగెడుతున్న ముళ్లపందిని పట్టుకోవడంలో ఆటగాళ్లు విఫలమయ్యారు. దీంతో డెర్బీషైర్‌ వికెట్‌ కీపర్‌ జార్జ్‌ డాక్స్‌ తన చేతులకున్న గ్లౌజులతో దానిని జాగ్రత్తగా పట్టుకొని మైదానం బయట విడిచిపెట్టాడు. 1889లో వార్సెస్టర్‌షైర్‌, డెర్బీషైర్‌ మ్యాచ్‌ మధ్యలో పంది రావడంతో కూడా ఓ మ్యాచ్‌ ఆగింది.

బ్రెడ్ వాసనతో మోగిన ఫైర్‌ అలారం

బ్రెడ్ వాసనతో మోగిన ఫైర్‌ అలారం

మరో 18 పరుగులు చేస్తే న్యూసౌత్‌ వేల్స్‌ జట్టు విజయం సాధిస్తుంది. ఈ సమయంలో 30 నిమిషాల వరకు మ్యాచ్ నిలిచిపోయింది. బ్రిస్బేన్‌లోని అలెన్‌ బోర్డర్‌ మైదానంలో ఫైర్‌ అలారం రావడమే ఇందుకు కారణమైంది. 2017-18 షెఫీల్డ్‌ షీల్డ్‌ సీజన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్ లయాన్ బ్రెడ్ ముక్కను కాలుస్తుంటే పొగలు రావడంతో పైర్ అలారం మోగింది.

పాము రావడంతో నిలిచిన మ్యాచ్

పాము రావడంతో నిలిచిన మ్యాచ్

2009లో సిడ్నీ సమీపంలోని బ్లాక్‌టౌన్‌లో అండర్‌-17 మ్యాచ్‌ జరుగుతుండగా ఎర్రరంగు పొట్ట, పైభాగం నల్లరంగుతో ఉన్న పాము కనిపించింది. దీంతో మ్యాచ్‌‌ని 20 నిమిషాలు నిలిపేశారు.

హలాల్‌ చేసిన ఆహారం అందించడంలో గందరగోళం

హలాల్‌ చేసిన ఆహారం అందించడంలో గందరగోళం

బ్లోమ్‌ఫోంటీన్‌ వేదికగా బంగ్లాదేశ్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ జరుగుతుంది. తొలి రోజు బంగ్లాదేశ్ జట్టుకు హలాల్‌ చేసిన ఆహారం అందించడంలో ఆలస్యం అయింది. వారికి ఆహారం అందించే వంటవారు ఆహార జాబితాను తప్పుగా ముద్రించడంతో గంటన్నర పాటు బంగ్లాదేశ్ అదనంగా బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది.

Story first published: Wednesday, January 23, 2019, 18:18 [IST]
Other articles published on Jan 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X