న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand: 'గిల్‌లో 10 శాతం కూడా లేను'

India vs New Zealand: I was not even 10 percent of Gill when I was 19: Kohli

హైదరాబాద్: న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆటగాడు శుభమాన్ గిల్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. నెట్స్‌లో అతను బ్యాటింగ్ చేస్తున్న తీరు అద్భుతమని కితాబిచ్చాడు. 19 ఏళ్ల గిల్‌లో గొప్ప ప్రతిభ ఉందని, తాను అదే వయసులో ఉన్నపుడు అతనిలో 10 శాతం ప్రతిభ కూడా లేదని కోహ్లీ అన్నాడు.

అనుమానాస్పదం: అంబటి రాయుడిపై ఐసీసీ వేటుఅనుమానాస్పదం: అంబటి రాయుడిపై ఐసీసీ వేటు

సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో మరో రెండు వన్డేలు మిగిలుండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టీమిండియాకు ఇది వరుసగా రెండో సిరిస్ విజయం. న్యూజిలాండ్ నిర్దేశించిన 244 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 43 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.

నెట్స్‌లో అతని బ్యాటింగ్ చూసి ముగ్దుడినయ్యా

నెట్స్‌లో అతని బ్యాటింగ్ చూసి ముగ్దుడినయ్యా

భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్‌ శర్మ (62), విరాట్‌ కోహ్లీ (60), అంబటి రాయుడు(40), దినేశ్‌ కార్తీక్‌(38) రాణించారు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "అత్యుత్తమ ప్రతిభ కలిగిన కుర్రాళ్లు మనకు అందుబాటులోకి వస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని పృథ్వీ షా రెండు చేతుల్లా ఒడిసిపట్టుకున్నాడు. ఇప్పుడు గిల్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. నెట్స్‌లో అతని బ్యాటింగ్ చూసి ముగ్దుడినయ్యా" అని అన్నాడు.

నాకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు

నాకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు

"నాకు 19 ఏళ్లు ఉన్నప్పుడు గిల్ నైపుణ్యంలో సగం కూడాలేదు. కుర్రాళ్లు మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీళ్లు ఇవే ప్రమాణాలు కొనసాగిస్తే భారత క్రికెట్‌కు చాలా ప్రయోజనం చేకూరుతుంది. యువ క్రికెటర్లు ఎదగడానికి అవసరమైన అవకాశాలు ఇస్తూ వాళ్లకు సాయపడటం చాలా సంతోషాన్నిస్తున్నది" అని కోహ్లీ అన్నాడు.

జట్టు కూర్పు గురించి

జట్టు కూర్పు గురించి

"మేం ఆటోమోడ్‌తో ప్రపంచకప్‌లోకి అడుగుపెడుతాం. ప్రస్తుతానికి జట్టు కూర్పు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాలుగో నంబర్‌లో బలమైన బ్యాట్స్‌మన్ ఉండాలని భావించాం. ఆ స్థానంలో రాయుడు ఆడుతున్న తీరు అద్భుతం. దినేశ్ కార్తీక్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఏ క్షణమైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉంటాడు. మిడిలార్డర్‌లో ధోనీ బంతిని బాగా బాదుతున్నాడు" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సిరీస్ గెలిచాం కాబట్టి మరింత హాయిగా

సిరీస్ గెలిచాం కాబట్టి మరింత హాయిగా

"ఈ మూడు మ్యాచ్‌లను బట్టి చూస్తే ఇక బ్యాటింగ్ బాధలు తీరినట్లే. ఆసీస్ టూర్‌లో ఊపిరి సలుపలేదు. కాబట్టే ఇప్పుడు విశ్రాంతికి వెళ్తున్నా. ఎలాగూ సిరీస్ గెలిచాం కాబట్టి మరింత హాయి గా గడుపొచ్చు. ప్రస్తుతం టీమ్ అంతా ఆటోమోడ్‌లో ఉంది. చివరి రెండు వన్డేలు కూడా గెలుస్తామన్న నమ్మకం ఉంది. రాయుడు, కార్తీక్ చేసిన ప్రతి పరుగును చప్పట్లతో స్వాగతించాం" అని కోహ్లీ అన్నాడు.

మూడో వన్డేలో పాండ్యా అద్భుత ప్రదర్శన

మూడో వన్డేలో పాండ్యా అద్భుత ప్రదర్శన

మరోవైపు నిషేధం ఎత్తివేత తర్వాత మూడో వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన పాండ్యాపై కూడా కోహ్లీ ప్రసంసలు కురిపించాడు. "పాండ్యా తిరిగి జట్టులో చూడటం సంతోషంగా ఉంది. త‌ల తిప్ప‌కుండా వికెట్ మీదే దృష్టి పెట్టి పాండ్యా బౌలింగ్ చేశాడ‌ు. పాండ్యా బౌలింగ్ చేసిన విధానం చూస్తే అత‌నెంత ఫోక‌స్ చేశాడో అర్థ‌మ‌వుతుంది. ప‌ది ఓవ‌ర్లు వేసిన పాండ్యా 2 వికెట్లు తీసుకుని 45 ర‌న్స్ ఇచ్చాడు" అని కోహ్లీ అన్నాడు.

పాఠం నేర్చుకుని మెరుగైన క్రికెటర్‌గా

పాఠం నేర్చుకుని మెరుగైన క్రికెటర్‌గా

"జీవితంలో ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనపుడు రెండు దారులుంటాయి. దాని వల్ల పాతాళానికి పడిపోయే ప్రమాదముంటుంది. అలా కాకుండా దాని నుంచి పాఠం నేర్చుకుని, స్ఫూర్తి నింపుకుని ముందుకు సాగొచ్చు. వివాదం తర్వాత పాండ్య మెరుగైన క్రికెటర్‌గా రూపుదిద్దుకుంటాడని అనుకుంటున్నా. అది అతను చేయగలడు" అని కోహ్లీ అన్నాడు.

Story first published: Tuesday, January 29, 2019, 9:50 [IST]
Other articles published on Jan 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X