న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5th ODI: రాణించిన రాయుడు, పాండ్యా... కివీస్ విజయ లక్ష్యం 253

India vs New Zealand, 5th ODI: Ambati Rayudu, Hardik Pandya Take India To 252

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఆఖరి వన్డేలో టీమిండియా పరువు నిలుపుకుంది. భారత జట్టులో అంబటి రాయుడు (90: 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు), హార్దిక్ పాండ్యా (45: 22 బంతుల్లో 2 ఫోర్లు, 5సిక్సులు) మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు, నీష‌మ్ ఒక వికెట్ తీసుకున్నారు.

1
44084
టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్

టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కివీస్‌ పేసర్లు హెన్రీ, బౌల్ట్‌లు విజృంభించడంతో టీమిండియా 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 5వ ఓవర్ వేసిన మాట్ హెన్రీ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్ శర్మ క్లీన్ బౌల్డవగా.. ఆ తర్వాత ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అప్పర్ కట్ ఆడిన శిఖర్ ధావన్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ మాట్ హెన్రీ చేతికి చిక్కాడు.

రెండో మ్యాచ్‌లోనూ గిల్ విఫలం

రెండో మ్యాచ్‌లోనూ గిల్ విఫలం

అనంతరం నిలకడగా ఆడినట్లు కనిపించిన శుభమన్ గిల్ కూడా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. హెన్రీ బౌలింగ్‌లో పేలవ ఫుట్‌వర్క్ కారణంగా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ధోని.. బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ దశలో జట్టుని ఆదుకున్న రాయుడు, శంకర్ జోడీ.. మెరుగైన స్కోరు అందించారు.

రాయుడు హాఫ్ సెంచరీ

ఈ క్రమంలో అంబటి రాయుడు హాఫ్‌ సెంచరీ సాధించాడు. 86 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో కెరీర్‌లో 10వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను రాయుడు.. క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌తో కలిసి ఆదుకున్నాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

సమన్వయలోపం కారణంగా శంకర్ రనౌట్

ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీకి చేరువైన విజయ్‌ శంకర్‌ జట్టు స్కోరు 116 వద్ద రాయుడితో సమన్వయలోపం కారణంగా శంకర్ రనౌటయ్యాడు. విజయ్ శంకర్ రనౌటైన తర్వాత దూకుడుగా ఆడిన రాయుడు.. సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. జట్టు స్కోరు 190 వద్ద సిక్స్ కొట్టే ప్రయత్నంలో హెన్రీ బౌలింగ్‌లో ఫీల్డర్ మున్రోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

చివర్లో మెరుపులు మెరిపించిన పాండ్యా

ఇన్నింగ్స్ 47వ ఓవర్ వేసిన ఆస్లే బౌలింగ్‌లో 6, 6, 6 బాదిన హార్దిక్.. ఆ తర్వాత ఓవర్‌లోనూ బౌల్ట్‌ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. ఇక ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన నీషమ్ బౌలింగ్‌లోనూ 4, 6 బాదేశాడు. అయితే, జట్టు స్కోరు 248 వద్ద పాండ్యా ఔటవగా.. ఆఖరి ఓవర్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి మహ్మద్ షమీ రనౌటయ్యాడు. దీంతో ఒక బంతి మిగిలుండగానే టీమిండియా 252 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు, నీష‌మ్ ఒక వికెట్ తీసుకున్నారు.

Story first published: Sunday, February 3, 2019, 12:03 [IST]
Other articles published on Feb 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X