న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో టీ20లో భారత్ విజయం: 2-1తో సిరిస్ కైవసం

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య చివరిదైన మూడో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. రాత్రి 6:30 గంటలకు టాస్‌ వేయాలి.

By Nageshwara Rao

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో అద్భుత విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 8 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మూడో టీ20లో విజయం సాధించడంతో 2-1తో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. వర్షం కారణంగా మూడో టీ20 మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 67 పరుగులు చేసింది. ఒక మోస్తారు లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు.


న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సాగిందిలా:

4 ఓవర్లకు 26 పరుగులు చేసిన న్యూజిలాండ్
భారత్ నిర్దేశించిన 68 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తడబడుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 4 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ నెమ్మదిగా ఆడుతూ పరుగుల రాబడుతున్నారు. వర్షం కారణంగా మూడో టీ20ని 8 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్ విజయ లక్ష్యం 68
తిరువనంతపురం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20ను 8 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన న్యూజీలాండ్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో నిర్ణీత 8 ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ విజయ లక్ష్యం 68 పరుగులుగా నిర్దేశించింది.

భారత్ బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ (8), శిఖర్ ధావన్ (6), విరాట్ కోహ్లీ (13), అయ్యర్ (6), మనీష్ పాండే (17), హార్థిక్ పాండే (14) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఇష్ సోధీ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ట్రెంట్ బౌల్డ్ ఒక వికెట్ తీశాడు.

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
మూడో టీ20లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కోహ్లీసేనను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ 8, శిఖర్ ధావన్ 6 పరుగులకే నిష్క్రమించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ 13 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ (6) పరుగులే చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం 6 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది.

కోహ్లీ ఔట్: మూడో వికెట్ కోల్పోయిన భారత్
మూడో టీ20లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కోహ్లీసేనను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ 8, శిఖర్ ధావన్ 6 పరుగులకే నిష్క్రమించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ 13 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.

15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్
తిరువనంతపురం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించడంతో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 15 పరుగులకే భారత్ ఓపెనర్లు ధావన్ (6), రోహిత్ శర్మ (8) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 3 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి భారత్ 18 పరుగులు చేసింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
తిరువనంతపురం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించారు. నలుగురు బౌలర్లు రెండు ఓవర్ల చొప్పున వేయొచ్చు.

క్రికెట్ అభిమానులకు శుభ వార్త: రాత్రి 9.15 గంటలకు టాస్
క్రికెట్ అభిమానులకు శుభ వార్త. మరి కాసేపట్లో మూడో టీ20 ప్రారంభం కానుంది. 9:00 గంటలకు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆటకు అనుమతిచ్చారు. అయితే మ్యాచ్‌ను ఎనిమిది ఓవర్లకు కుదించారు. మరికాసేపట్లో టాస్ పడనుంది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షం కాస్త తెరిపినివ్వడంతో గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను ఆటకు సిద్ధం చేశారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

రాత్రి 9 గంటలకు పిచ్‌ను పరిశీలించిన అంఫైర్లు

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో టీ20 జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షం ఆగిపోయింది. దీంతో స్టేడియం సిబ్బంది ఔట్‌ ఫీల్డ్‌పై కవర్లు తొలగించారు. సూపర్‌ సోపర్స్‌ ద్వారా తేమను తొలగిస్తున్నారు. అయితే పిచ్‌పై మాత్రం కవర్లను అలాగే ఉంచారు. షెడ్యూల్ సమయం మించిపోవడంతో ఓవర్లను కచ్చితంగా కుదించే అవకాశం ఉంది. మ్యాచ్ రాత్రి 9:00 గంటలకు ప్రారంభమైతే 15 ఓవర్లు కోత విధిస్తారు. ఒకవేళ రాత్రి 10:15 గంటలకైతే తలో ఐదు ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించే అవకాశాలు ఉంటాయి.

ఫుట్‌బాల్ ఆడిన క్రికెటర్లు
సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20కి వర్షం అడ్డంకిగా మారడంతో నిర్ణీత సమయానికి దాదాపు రెండు గంటలు దాటినా మ్యాచ్ ప్రారంభం కాలేదు. వర్షం తగ్గినా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో అంపైర్లు ఇప్పటికే ఒకసారి మైదానాన్ని పరీక్షించారు. గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. వర్షం తెరిపినివ్వడంతో డ్రస్సింగ్ రూమ్‌కే పరిమితమైన ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి కాసేపు సరదాగా ఫుట్‌బాల్ ఆడుకున్నారు. ఆటగాళ్లు ఫుట్‌బాల్ ఆడుతున్న ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కాగా, ఇప్పటికే రవిశాస్త్రి, భరత్ అరుణ్, కొందరు న్యూజిలాండ్ ఆటగాళ్లు పిచ్‌ను పరిశీలించారు. 9 గంటలకు మరోమారు పరిశీలించిన అనంతరం మ్యచ్‌పై నిర్ణయం తీసుకుంటారు.

స్టేడియంలో గొడుగులతో అభిమానులు:

దేవుడా కరుణించు: మ్యాచ్ జరగాలని అభిమానుల పూజలు
మూడో టీ20కి వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉండటంతో మ్యాచ్ ఎలాగైనా జరగాలని కోరుకుంటూ తిరువనంతపురంలోని పళవనగడి గణపతి ఆలయం ముందు అభిమానులు క్యూ కట్టారు. వందల కొద్దీ కొబ్బరికాయలు కొడుతున్నారు. గత రెండు రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం, సాయంత్రం మ్యాచ్‌కు ముందు కూడా భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

29 ఏళ్ల తర్వాత ఇక్కడ ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుందని, అందుకే మ్యాచ్ సజావుగా జరగాలని దేవుడిని కోరుకుంటున్నట్లు అక్కడికి వచ్చిన అభిమానులు చెప్పారు. అయితే ఎంత వర్షం పడినా మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఈ గ్రౌండ్‌లో ఉండటం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే విషయం. వర్షం ఆగిన పది నిమిషాల్లో గ్రౌండ్‌ను సిద్ధం చేస్తామని సిబ్బంది చెబుతున్నారు. ఈ స్టేడియం కెపాసిటీ 50 వేలు కాగా.. ఇప్పటికే ఫుల్ హౌజ్ అయిపోయింది.

టాస్ ఆలస్యం

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య చివరిదైన మూడో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. రాత్రి 6:30 గంటలకు టాస్‌ వేయాలి. 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. మరోవైపు వర్షం ఆగడంతో సిబ్బంది మైదానంలోకి పరుగెత్తుకొచ్చారు. చీపుర్లు, స్పాంజ్‌లతో పిచ్‌పై కప్పిన కవర్లపై ఉన్న నీటిని తోడుతున్నారు. మ్యాచ్‌ కోసం మైదానం సిద్ధం చేస్తున్నారు. అంపైర్లు గొడుగులు వేసుకొని మైదానంలోకి వచ్చారు. మూడో టీ20కి ఆతిథ్యమిస్తోన్న గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో చిరుజల్లులు పడుతుండటంతో టాస్ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

స్టేడియం సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పిఉంచారు. వర్షం గనుక ఆగిపోతే 15-20 నిమిషాల్లో స్టేడియాన్ని సిద్ధం చేయగలమని కేరళ క్రికెట్‌ సంఘం ఇంతకముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి మ్యాచ్‌ ప్రారంభం అవుతుందా? లేదా తెలియాల్సి ఉంది.

ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. దీంతో మూడో టీ20లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వన్డే సిరీస్‌ను నెగ్గిన కోహ్లీసేన టీ20 సిరీస్‌నూ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా.. వన్డే సిరీస్‌ను త్రుటిలో చేర్చుకున్న కివీస్‌ కనీసం టీ20 సిరీస్‌ అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది.

ఢిల్లీ వేదకగా జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన అలవోక విజయం సాధించగా... రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో మాత్రం కోహ్లీసేన పూర్తిగా విఫలమైంది. మూడో టీ20 జరుగుతున్న ఈ స్టేడియంలో చివరిసారిగా 29 ఏళ్ల కిందట వెస్టిండీస్‌తో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది.

గ్రీన్ ఫీల్డ్ స్టేడియంగా మారిన తర్వాత ఈ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఇదిలా ఉంటే భారత్‌లో టీ20లకు ఆతిథ్యమిస్తున్న 19వ వేదికగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం నిలిచింది.

జట్లు:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, చాహల్, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, మొహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ బ్రూస్, గ్రాండ్ హోమ్, గ్లెన్ ఫిలిప్స్, మున్రో, సాంట్నార్, మిల్నే, నికోలస్, ఇష్ సోధీ

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X