న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PinkBall Test: వైరల్ వీడియో.. స్మిత్‌ని టీజ్ చేసిన కోహ్లీ!!

India vs England: Virat Kohli imitates Steve Smiths batting style during training
Ind vs Eng 2021,3rd Test : Kohli Imitate Smith's Batting During Practice At Narendra Modi Stadium

అహ్మదాబాద్‌: గ్రౌండ్‌లో కాస్త టెన్షన్‌గా కనిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బయట మాత్రం ఎంతో సరదాగా గడుపుతుంటాడు. సహచర ఆటగాళ్లను ఆటపట్టించడంలోనూ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. తన చిలిపి పనులతో నవ్వులు పూయిస్తుంటాడు. సహచరులపై జోక్‌లు పేలుస్తూ వారిని అనుకరించే కోహ్లీ.. అప్పుడప్పుడూ ప్రత్యర్థి టీమ్ ఆటగాళ్లనీ కూడా సరదాగా ఆటపట్టిస్తుంటాడు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి భారత్-ఇంగ్లండ్ మధ్య బుధవారం ప్రారంభం అయిన డేనైట్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌‌ స్టయిల్‌ని కోహ్లీ అనుకరించాడు.

డేనైట్ టెస్ట్ మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన విరాట్ కోహ్లీ.. సరదాగా స్టీవ్ ‌స్మిత్‌ని అనుకరిస్తూ కనిపించాడు. షాట్ ఆడిన తర్వాత చేతులతో బ్యాట్ ఊపుతూ స్మిత్‌ని టీజ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇదివరకు ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌కి కోహ్లీ అనుకరించిన విషయం తెలిసిందే.

PinkBall Test: సొంత మైదానంలో తిప్పేసిన అక్షర్ పటేల్.. 112 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!!PinkBall Test: సొంత మైదానంలో తిప్పేసిన అక్షర్ పటేల్.. 112 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!!

స్టీవ్ ‌స్మిత్ బ్యాటింగ్ శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. క్రీజులో స్టాన్స్ తీసుకునే దగ్గర నుంచి.. షాట్ ఆడిన తర్వాత అతను ఇచ్చే రియాక్షన్ ఫన్నీగా ఉంటాయి. బ్యాట్, చేతులు, కాళ్లతో ఒకరకమైన విన్యాసాలు చేస్తుంటాడు. బంతిని ఆడకుండా వదిలేసేందుకు ఓ సెపరేట్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు. ఫాస్ట్ బౌలర్లని రెచ్చగొట్టి వారి లయని దెబ్బతీసేందుకు ‌స్మిత్ క్రీజు వెలుపలికి వచ్చి బంతిని డిఫెన్స్ చేస్తూ.. అదోరకమైన హావభావాల్ని ప్రదర్శిస్తుంటాడు. అవన్నీ కూడా ఫన్నీగా ఉంటాయి.

భారత బౌలర్ల దెబ్బకి మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ తేలిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 48.4 ఓవర్లలోనే 112 పరుగులకి ఆలౌటైపోయింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ 6/38తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. ఆర్ అశ్విన్‌కి మూడు, ఇషాంత్ శర్మకి ఒక వికెట్ దక్కింది. ఇంగ్లండ్ టీమ్‌లో ఓపెనర్ జాక్ క్రాలీ (53: 84 బంతుల్లో 10x4) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ప్రస్తుతం 12 ఓవర్లలో 22 పరుగులు చేసింది.

Story first published: Wednesday, February 24, 2021, 20:48 [IST]
Other articles published on Feb 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X