న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్‌లో రెండో టెస్టు: తొలిరోజు తొలి సెషన్ వర్షార్పణం

By Nageshwara Rao
India vs England, Live Cricket Score, 2nd Test Day 1 at Lords: Rain Washes Out First Session

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌, భారత జట్ల మధ్య గురువారం ప్రారంభం కావాల్సిన
రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారడంతో తొలి రోజు తొలి సెషన్ వర్షార్పణమైంది. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం పడుతుండడంతో మ్యాచ్ తొలి సెషన్‌ని రద్దు చేసి అంఫైర్లు త్వరగా లంచ్ విరామాన్ని ప్రకటించారు.

వర్షం ఎక్కవగా కురుస్తుండటంతో తొలిరోజు ఆట రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వర్షం ధాటిగా పిచ్ పాడవకుండా క్యూరేటర్లు పిచ్‌ని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో ఆటగాళ్లు డ్రస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారం రెండో టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది.

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో లార్డ్స్ టెస్టులో గెలవడం ద్వారా సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మైదానంలో 17 టెస్టులాడిన భారత్ కేవలం రెండింటిలోనే గెలిచింది. నాలుగు డ్రా కాగా, 11 మ్యాచుల్లో ఓడింది.

మరోవైపు లార్డ్స్ మైదానం నిర్వాహకులు మాత్రం టీమిండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లకి నోరూరించే భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ భోజనానికి సంబంధించిన మెనూ వివరాలను బీసీసీఐ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ మెనూలో కొన్ని ఇంగ్లీష్ వంటకాలతో పాటు భారతీయ వంటకాలు కూడా ఉన్నాయి.

టీమిండియా ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా, మిక్సిడ్ వెజిటేబుల్స్‌తో పప్పుని సిద్ధం చేశారు. కాగా, లార్డ్స్ టెస్టును క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన చేతుల మీదుగా ఆరంభించనున్నాడు. ఈ మైదానంలో ఏదైనా టెస్టు ఆరంభానికి ముందు ఐదు నిమిషాల పాటు గంట మోగిస్తారు.

పర్యాటక జట్టుకు సంబంధించిన వారు ఎవరైనా గంటను మోగించి లాంఛనంగా మ్యాచ్‌ను ప్రారంభించడం ఎప్పటి నుంచో ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. గురువారం లార్డ్స్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో సచిన్‌ టెండూల్కర్‌ తొలి రోజు మ్యాచ్‌ను గంట మోగించి ప్రారంభించాల్సిందిగా మైదానం నిర్వాహకులు అడిగితే అందుకు అంగీకరించాడు.

Story first published: Thursday, August 9, 2018, 19:43 [IST]
Other articles published on Aug 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X