న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: తొలిసారి టెస్టు ఆడబోతున్న బుమ్రా.. ఐసీసీ 'ఆల్‌ ది బెస్ట్‌'!!

India vs England: Jasprit Bumrah makes Test debut in India in Chennai Test

చెన్నై: నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్ మధ్య శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో మరికొద్ది సేపట్లో తొలి టెస్టు ఆరంభంకానుంది. మూడు రోజులు ప్రాక్టీస్‌ చేసిన రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ టెస్టు సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా గురించి ఒక విషయం ఆసక్తి రేపుతుంది. అదేంటంటే.. పేస్ గన్ బుమ్రా భారత్‌ గడ్డపై తొలిసారి టెస్టు మ్యాచ్‌ ఆడబోతున్నాడు. ఇప్పటివరకు బుమ్రా టీమిండియా తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడడం విశేషం.

Bangladesh vs West Indies: ఎనిమిదో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన స్పిన్నర్‌!!Bangladesh vs West Indies: ఎనిమిదో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన స్పిన్నర్‌!!

 భారత్‌ గడ్డపై తొలిసారి:

భారత్‌ గడ్డపై తొలిసారి:

2018 జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 17 టెస్టుల్లో 79 వికెట్లు పడగొట్టాడు. అవన్నీ విదేశాల్లోనే రావడం విశేషం. బుమ్రా శుక్రవారం చెన్నైలోనే భారత్‌ గడ్డపై తొలిసారి టెస్టు మ్యాచ్‌ ఆడబోతున్నాడు. బుమ్రా 2016లోనే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసి సత్తాచాటాడు. అంతర్జాతీయ స్థాయిలో అతి తక్కువ సమయంలో స్టార్‌ పేసర్‌గా ఎదిగిన బుమ్రా ఇంగ్లండ్‌పై ఎలా పోరాడతాడో? అంటూ ఐసీసీ ట్వీట్‌ చేసింది.

21 సగటుతో 79 వికెట్లు:

21 సగటుతో 79 వికెట్లు:

జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 21 సగటుతో 79 వికెట్లు తీశాడు. ఇందులో 5 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేగాక అరంగేట్రం చేసిన ఏడాదిలోనే 8 మ్యాచ్‌ల్లో 48 వికెట్లతో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా.. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటికే స్వదేశంలో తనదైన మార్క్‌ చూపిన బుమ్రా.. టెస్టులో తన ముద్రను ఎలా వేయనున్నాడనేది తేలిపోనుంది. బుమ్రా భారత్ తరఫున 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.

హాట్ ఫేవరెట్‌గా భారత్:

సుదీర్ఘ పర్యటనలో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలను భారత్ గడ్డపై ఇంగ్లండ్ ఆడనుంది. ఓవరాల్‌గా రికార్డులపరంగా చూసుకుంటే ఈరోజు మ్యాచ్‌లో టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ టీమ్ పూర్తి స్థాయిలో సిరీస్‌ కోసం భారత్‌కి రాగా.. అప్పట్లో ఐదు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 4-0తో గెలిచింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్ తర్వాత భారత్‌‌లో ఈరోజే మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లు ప్రారంభంకాబోతున్నాయి.

Story first published: Friday, February 5, 2021, 9:02 [IST]
Other articles published on Feb 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X