న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళల వరల్డ్ టీ20: సెమీపైనల్లో చతికిలబడ్డ భారత్, ఇంగ్లాండ్ చేతిలో ఓటమి

ICC Women's T20 World Cup 2018 : Ind vs Eng: India Lost Semis By 8 Wickets | Oneindia Telugu
India vs England, ICC Womens World T20 Semi-Final: India Crash Out, England Meet Australia In Final

హైదరాబాద్: హైదరాబాద్: వరల్డ్ టీ20 గెలవాలనే కోరిక‌ భారత మహిళల జట్టుకి మ‌రోసారి అందని ద్రాక్ష‌గానే మిగిలింది. వెస్టిండిస్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ టీ20లో సెమీఫైనల్లో భారత జట్టు ఓడిపోయింది. లీగ్‌ల‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్ళిన భార‌త మహిళల జట్టు కీలక‌మైన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో చతికిల ప‌డింది.

ఆంటిగ్వా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంభమే ఇచ్చారు. ఓపెనర్ స్మృతి మంధాన-తానియా భాటియా తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు.

 ఆరో ఓవర్‌లో స్మృతి మందానను పెవిలియన్‌కు

ఆరో ఓవర్‌లో స్మృతి మందానను పెవిలియన్‌కు

దూకుడుగా ఆడుతున్న క్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్‌ నైట్‌ ఈ జోడీని విడగొట్టింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో స్మృతి మందానను పెవిలియన్‌కు చేరగా, తర్వాతి ఓవర్‌లోనే భాటియా కూడా ఔటైంది. దీంతో స్కోరు బోర్డు ఒక్కసారిగా నెమ్మదించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌‌తో కలిసి జెమీమా రోడ్రిగ్స్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది.

మూడో వికెట్‌కు 36 పరుగులు

మూడో వికెట్‌కు 36 పరుగులు

వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 36 పరుగులు జోడించారు. ఆ సమయంలో రోడ్రిగ్స్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది. ఆ తర్వాత భారత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా ఆకట్టుకోలేకపోయింది.

మహిళల వరల్డ్ టీ20: వెస్టిండిస్ ఓటమి, పైనల్లో ఆస్ట్రేలియా

19.3 ఓవర్లలో 112 పరుగులకే భారత్ ఆలౌట్

19.3 ఓవర్లలో 112 పరుగులకే భారత్ ఆలౌట్

చివర్లో టెయిలెండర్లు సైతం చేతులెత్తేయడంతో భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాట్స్ ఉమెన్‌లలో ఓపెనర్‌ స్మృతి మంధాన(34) టాస్ స్కోరర్‌గా నిలవగా, రోడ్రిగ్స్‌ (26) ఫరవాలేదనిపించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో కెప్టెన్‌ నైట్‌ మూడు వికెట్లు, ఎక్లేస్టన్‌, జోర్డాన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించిన ఇంగ్లాండ్

ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించిన ఇంగ్లాండ్

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆడుతూ పాడుతూ చేధించింది. ఇంగ్లాండ్‌ను ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌లోనే రాధా యాదవ్ దెబ్బకొట్టింది. ఒక పరుగు మాత్రమే చేసిన బ్యూమౌంట్ మిడాన్‌లో ఉన్న అరుందతీ రెడ్డి చేతికి చిక్కింది. తర్వాత క్రీజులోకి వచ్చిన డానీ వ్యాట్ కూడా ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఔటైంది.

మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం

మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం

దీంతో భారత్‌ శిబిరంలో ఆశలు రేకెత్తాయి. అయితే, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నాటాలీ స్కివర్-అమీ అలెన్ జోన్స్ జోడీ మరో వికెట్ పడకుండా ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించారు. స్కివ‌ర్ (52), జోన్స్ (53) హాఫ్ సెంచరీలతో చెలరగడంతో పాటు మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో మరో 17 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది.

అమీ జోన్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

అమీ జోన్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

భారత బౌలర్లలో దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ క్రికెటర్ అమీ జోన్స్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంది. న‌వంబ‌ర్ 24న ఆంటిగ్వా వేదిక‌గా ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. ఫైన‌ల్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు త‌ల‌ప‌డ‌నున్నాయి.

1
9996-nonopta-8646
Story first published: Friday, November 23, 2018, 9:39 [IST]
Other articles published on Nov 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X