మహిళల వరల్డ్ టీ20: వెస్టిండిస్ ఓటమి, పైనల్లో ఆస్ట్రేలియా

హైదరాబాద్: వెస్టిండిస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ టీ20లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు వెస్టిండిస్‌తో జరిగిన తొలి సెమీపైనల్లో 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ ఉమెన్‌లలో అలీసా హీలీ (46), లానింగ్ (31), రాచెల్ హెనెస్ (25 నాటౌట్) రాణించారు. విండీస్ బౌలర్లలో సేల్‌మన్, టేలర్, మథ్యేస్, ఫ్లెచర్, డాటిన్ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండిస్ జట్టు
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండిస్ జట్టు కనీసం పోరాట పటిమను కూడా ప్రదర్శించలేదు. టాపార్డర్ విఫలం కావడంతో వెస్టిండిస్ జట్టు 17.3 ఓవర్లలో 75 పరుగలకే ఆలౌటైంది. కెప్టెన్ స్టెఫానీ టేలర్(16) తప్ప మిగిలిన వారెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
ఫైనల్లో ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్
ఆస్ట్రేలియా బౌలర్లలో పెర్రీ, కిమ్మిన్స్, గార్డ్నర్ తలో రెండు వికెట్లతో రాణించారు. దీంతో ఆసీస్ ఘనవిజయంతో ఫైనల్లో అడుగెట్టింది. ఇక, రెండో సెమీపైనల్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. దీంతో శనివారం జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications