న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: నాలుగో టెస్టుకు అలెస్టర్ కుక్‌ దూరం!

By Nageshwara Rao
India vs England: Cook Could Miss fourth Test to Attend the Birth of His Child

హైదరాబాద్: టీమిండియాతో జరగబోయే నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలెస్టర్‌ కుక్‌ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆగస్టు 30న సౌతాంప్టన్‌ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభంకానుంది.

ఆలెస్టర్ కుక్‌ భార్య అలైస్‌ హట్‌ ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఆగస్టు చివరినాటికి ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ఆ సమయంలో తన భార్య పక్కన ఉండాలని కుక్ అనుకుంటున్నాడట. ఈ కారణంగా అతడు నాలుగో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

నాలుగో టెస్టులో అలెస్టర్ కుక్ ఆడతాడా లేదా అన్నది త్వరలోనే జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోనుంది. 2011లో అలెస్టర్ కుక్‌- అలైస్ హట్‌కు వివాహమైంది. వీరికి ఇప్పటికే ఇద్దరు సంతానం. ఈ సిరిస్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది.

ఐదు టెస్టు మ్యాచ్‍‌ల సిరిస్‌లో ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లాండ్ రెండు టెస్టుల్లో విజయం సాధించి 2-0 ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీసే విజయం సాధించేలా ఉంది. దీంతో నాలుగో టెస్టు ఇరు జట్లకు ఎంతో కీలకం.

1
42376

మరోవైపు, నాలుగో టెస్టుకు అలెస్టర్ కుక్ దూరమైతే వరుసగా అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడిగా నెలకొల్పిన రికార్డుకు బ్రేక్‌ పడుతుుంది. ఇప్పటి వరకు అలెస్టర్ కుక్ వరుసగా 157 టెస్టులు ఆడాడు. నాలుగో టెస్టు నుంచి కుక్ తప్పుకుంటే అతడి స్థానాన్ని సర్రే జట్టు ఓపెనర్ రోరే బర్న్స్‌తో ఇంగ్లాండ్ బోర్డు భర్తీ చేయనుంది.

ఇంగ్లీషు కౌంటీల్లో రోరే బర్న్స్‌ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడి 7000 పరుగులు నమోదు చేశాడు. ఇంగ్లాండ్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన అలెస్టర్ కుక్ ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కుక్ పెద్దగా రాణించడం లేదు.

2006లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన కుక్ ఈ ఏడాది 19 యావరేజితో తన కెరీర్‌లోనే చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. ఇంగ్లాండ్ వికెట్‌ కీపర్‌ బెయిర్‌ స్టో కూడా తదుపరి రెండు టెస్టుల్లో ఆడే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. మూడో రోజైన సోమవారం ఆటలో బెయిర్‌స్టో గాయం కారణంగా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, August 21, 2018, 15:49 [IST]
Other articles published on Aug 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X