న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England, 5th Test: 'టెయిలెండర్లను ఔట్ చేయడంలో విఫలమయ్యాం'

By Nageshwara Rao
India Vs England 2018 5 Test : 3 Day Highlights
India vs England, 5th Test: We couldnt execute our plans against tailenders: Bumrah

హైదరాబాద్: ఐదో టెస్టులో రెండో రోజైన శనివారం ఇంగ్లాండ్‌ టెయిలెండర్లపై తమ ప్రణాళికలు సరిగ్గా అమలు పరచడంలో విఫలమయ్యామని టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అన్నాడు. ఐదో టెస్టులో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

కెప్టెన్ కోహ్లీతో గొడవ: ఆండర్సన్‌కు జరిమానా విధించిన ఐసీసీకెప్టెన్ కోహ్లీతో గొడవ: ఆండర్సన్‌కు జరిమానా విధించిన ఐసీసీ

హనుమ విహారి కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే విశాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో టీమిండియా ఐదో బౌలర్‌ సేవలు కోల్పోయిందా? అన్న ప్రశ్నకు బుమ్రా తనదైన శైలిలో స్పందించాడు. "జట్టు ఎంపిక గురించి నాకు తెలియదు. ఇది జట్టు మేనేజ్‌మెంట్‌ను అడగాల్సిన ప్రశ్న" అని అన్నాడు.

1
42378
అదనపు బౌలర్‌ ఉంటే విశ్రాంతి దొరుకుతుంది

అదనపు బౌలర్‌ ఉంటే విశ్రాంతి దొరుకుతుంది

"అదనపు బౌలర్‌ ఉంటే కేవలం విశ్రాంతి దొరుకుతుంది. లేదంటే త్వరగా, ఎక్కువగా బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. నాకు కనిపించిన వ్యత్యాసం అదే. మేం చాలా అత్యుత్తమంగా బౌలింగ్‌ చేశాం. చాలా ఓవర్లు విసిరాం. ఇంగ్లాండ్‌ 190/7 ఉన్నప్పుడు మేం మంచి స్థాయిలో ఉన్నాం. కానీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ చాలా బాగా బ్యాటింగ్‌ చేశారు" అని బుమ్రా అన్నాడు.

అవకాశాలను మేం అందిపుచ్చుకోలేదు

అవకాశాలను మేం అందిపుచ్చుకోలేదు

"అవకాశాలను మేం అందిపుచ్చుకోలేదు. పిచ్‌పై సరైన ప్రాంతాల్లో బంతులు విసిరేందుకు ప్రయత్నించాం, కానీ కుదరలేదు. ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్ బాగా ఆడారు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కోసం ప్రత్యేక ప్రణాళిక ఏమీ లేదు. జోస్‌ బట్లర్‌ బాగా ఆడాడు. అతడిని త్వరగా ఔట్‌ చేసుంటే పరిస్థితి మరోలా ఉంటుందా లేదా చెప్పలేం" అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

లోయర్‌ ఆర్డర్‌లో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా, దూకుడుగా ఆడతారు

లోయర్‌ ఆర్డర్‌లో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా, దూకుడుగా ఆడతారు

"సాధారణంగా లోయర్‌ ఆర్డర్‌లో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా, దూకుడుగా ఆడతారు. వస్తే పరుగులొస్తాయి. లేదంటే పోయేదేమీ ఉండదు అన్నట్లు ఆడతారు" అని బుమ్రా అన్నాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో హనుమ విహారి (124 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్‌), రవీంద్ర జడేజా (156 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

 ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే

ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే

దీంతో ఇంగ్లాండ్‌ ఆధిపత్యాన్ని తగ్గించగలిగారు. ఈ క్రమంలో మూడో రోజైన ఆదివారం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లలో 292 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే లభించింది. అండర్సన్, స్టోక్స్, మొయిన్‌ అలీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది

Story first published: Monday, September 10, 2018, 8:44 [IST]
Other articles published on Sep 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X