న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ విజయం: 2-1తో సిరిస్ భారత్ వశం

India vs England 3rd Women’s ODI Highlights: England beat India by 2 wickets

హైదరాబాద్: ముంబై వేదికగా భారత మహిళల జట్టుతో గురువారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ మహిళల జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిథాలీ సేన నిర్దేశించిన 206 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ మహిళల జట్టు 48.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు భారత్‌ చేతిలో వైట్‌వాష్‌ నుంచి తప్పించుకుంది.

IPL 2019: పంత్ వార్నింగ్ వీడియోకి ధోని ఇచ్చిన రిప్లై ఇదే (వీడియో)IPL 2019: పంత్ వార్నింగ్ వీడియోకి ధోని ఇచ్చిన రిప్లై ఇదే (వీడియో)

స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ మహిళల జట్టు 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్సోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్‌ నైట్‌(47), డానియల్లీ వ్యాట్‌(56) హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో గోస్వామి మూడు వికెట్లు, పూనమ్‌ యాదవ్‌, శిఖా పాండేలు తలో రెండు వికెట్లు తీశారు.

అంతకముందు టాస్‌ గెలిచిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోడ్రిగ్స్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరిగా... స్మృతీ మంధాన(66) మరోసారి హాఫ్ సెంచరీ సాధించారు. ఆమెకు తోడు పూనమ్‌ రౌత్‌(56) కూడా హాఫ్ సెంచరీతో మెరవడంతో భారత్‌ రెండో వికెట్‌కు 129 పరుగులు జోడించింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(27 నాటౌట్‌), శిఖా పాండే(26) ఫరవాలేదనిపించడంతో భారత్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో కేథరిన్‌ బ్రంట్‌ ఐదు వికెట్లు తీయగా స్కీవర్‌, ఎల్విస్‌, ష్రబ్‌సోల్‌లు తలో వికెట్ తీశారు. ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను భారత్‌ ఇప్పటికే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస మొదటి రెండు వన్డేల్లో భారత్‌ విజయం సాధించి సిరిస్‌ను సొంతం చేసుకుంది.

Story first published: Thursday, February 28, 2019, 18:00 [IST]
Other articles published on Feb 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X