న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: ధోని రికార్డు బద్దలు, కెప్టెన్‌గా బోర్డర్ రికార్డుని సమం చేసిన కోహ్లీ

India vs Bangladesh: Virat Kohli breaks MS Dhonis India record with 10th innings win

హైదరాబాద్: ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు ఇది 10వ ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.

ఫలితంగా అత్యధిక ఇన్నింగ్స్ విజయాలు సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 10 ఇన్నింగ్స్ విజయాలు ఉండగా, భారత కెప్టెన్‌గా ధోని 9 ఇన్నింగ్స్ విజయాలను నమోదు చేశాడు.

India vs Bangladesh: ఇండోర్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయంIndia vs Bangladesh: ఇండోర్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం

ఆసీస్ మాజీ కెప్టెన్ బోర్డర్ రికార్డు సమం

ఆసీస్ మాజీ కెప్టెన్ బోర్డర్ రికార్డు సమం

ఈ జాబితాలో మహ్మద్ అజారుద్దీన్ 8 ఇన్నింగ్స్ విజయాలతో మూడో స్థానంలో నిలవగా... సౌరవ్ గంగూలీ 7 ఇన్నింగ్స్ విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అదే సమయంలో కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ 32 టెస్ట్ విజయాలు రికార్డుని విరాట్ కోహ్లీ సమం చేశాడు.

అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో

సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఉమ్మడిగా విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 77 మ్యాచ్‌ల్లో 48 విజయాలతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉండగా, స్టీవ్ వా 57 మ్యాచ్‌ల్లో 41 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు.

వరుసగా మూడు ఇన్నింగ్స్ విజయాలు

వరుసగా మూడు ఇన్నింగ్స్ విజయాలు

స్వదేశంలో టీమిండియా వరుసగా మూడు ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేయడం ఇది మూడోసారి కావడం విశేషం. పుణె, రాంచీ టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై, ఇండోర్‌లో బంగ్లాపై కోహ్లీసేన వరుసగా ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టీమ్‌ఇండియా 1992/93, 1993/94 సీజన్లలో కూడా ఈ తరహాలోనే విజయం సాధించింది.

Season: 1992/93

Innings & 22 runs vs England in Chennai

Innings & 15 runs vs England in Mumbai

Innings & 13 runs vs Zimbabwe in Delhi

Season: 1993/94

Innings & 119 runs vs Sri Lanka in Lucknow

Innings & 95 runs v Sri Lanka in Bengaluru

Innings & 17 runs v Sri Lanka in Ahmedabad

Season: 2019/20

Innings & 137 runs vs South Africa in Pune

Innings & 202 runs vs South Africa in Ranchi

Innings & 130 runs vs Bangladesh in Indore

షమికి మూడో అత్యుత్తమం

షమికి మూడో అత్యుత్తమం

రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్‌ను దెబ్బ తీసిన మహ్మద్ షమి (4/31) స్వదేశంలో ఇన్నింగ్స్‌ పరంగా తన మూడో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఇటీవల విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో షమి (5/35) ఐదు వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Saturday, November 16, 2019, 18:07 [IST]
Other articles published on Nov 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X