న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పింక్‌ బాల్‌తో అనుభవం భిన్నంగా ఉంది: తొలి డే/నైట్ టెస్టుపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

India Vs Bangladesh, Indore Test: Virat Kohli vows team will not get distracted by exciting first Day-Night Test

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పింక్ బాల్‌పై తన అనుభవాన్ని పంచుకున్నాడు. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ముగిసింది. దీంతో ఇరు జట్లు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌పై దృష్టి సారించాయి. ఇప్పటికే ఇండోర్‌కు చేరుకున్న ఇరు జట్ల ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి.

బంగ్లాతో తొలి టెస్టు గురువారం ప్రారంభమవుతున్నా.. టీమిండియా ఆటగాళ్ల ఆలోచనంతా డే/నైట్ టెస్టు మ్యాచ్‌పైనే ఉంది. కొత్త సవాల్‌కు సిద్ధమయ్యేందుకు సమయం తక్కువగా ఉండటంతో పూర్తిగా దృష్టంతా కోల్‌కతా టెస్టుపైనే పెట్టారు. పింక్ బాల్‌ను ఎలా ఎదుర్కోవాలి.. ఫ్లడ్‌లైట్ల కింద సుదీర్ఘ ఫార్మాట్ ఎలా ఉంటుందనే ఉత్సుకతతో ఉన్నారు.

India vs Bangladesh: వికెట్ దూరంలో అశ్విన్, కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు!India vs Bangladesh: వికెట్ దూరంలో అశ్విన్, కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు!

పింక్ బాల్‌తోనే ప్రాక్టీస్ చేసిన కోహ్లీ

పింక్ బాల్‌తోనే ప్రాక్టీస్ చేసిన కోహ్లీ

నెట్స్‌లో పింక్ బాల్‌తోనే ప్రాక్టీస్ చేయడం విశేషం. గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ "ఇది కొంచెం ఆతృతగా ఉంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఉత్సాహాన్ని కలిగించడానికి ఇది కొత్త మార్గం అని నా అభిప్రాయం. మేము అందరం దీని గురించి చాలా సంతోషిస్తున్నాం" అని కోహ్లీ అన్నాడు.

పింక్‌ బాల్‌పై విరాట్ కోహ్లీ

"ఇంతకు ముందు ఆడిన టెస్టు మ్యాచ్‌లు ఎర్రబంతితో ఆడాం. ఇప్పుడు డే-నైట్‌ టెస్టులకు పింక్‌ బాల్‌ని వినియోగించనున్నారు. దీంతో ఆ బంతితోనే ప్రాక్టీస్‌ మొదలు పెట్టాను. పింక్‌ బాల్‌తో ఆడిన అనుభం భిన్నంగా ఉంది. రెడ్‌ బాల్‌ కన్నా పింక్‌ బాల్‌ స్వింగ్‌ ఎక్కువ అవుతుంది" అని కోహ్లీ తెలిపాడు.

పింక్ బాల్‌తో ఆడడం కొంచెం కఠినంగా

"ఎర్రబంతితో ఆడి, ఒక్కసారిగా పింక్ బాల్‌తో ఆడడం కొంచెం కఠినంగా అనిపించింది. ఎందుకంటే ఆ బంతిపై పూత ఎక్కువగా ఉంది. బంతిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పింక్‌ బాల్‌తో ఆడడాన్ని అందరూ ఆస్వాదిస్తారు. పింక్‌బాల్‌ వల్ల బౌలర్లకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. పాత బంతి ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. మంచులో, బంతి పైపూత పోయిన తర్వాత బంతి ప్రవర్తన చూసేందుకు ఆసక్తికరంగా ఉంది" అని విరాట్ కోహ్లీ అన్నాడు. బంగ్లాతో జరిగిన టీ20 సిరిస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ మళ్లీ జట్టుతో కలిశాడు.

పింక్-బాల్ టెస్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు

పింక్-బాల్ టెస్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు

"టెస్ట్ క్రికెట్‌లో మీ దృష్టిని పక్కకు తిప్పుకోలేరు. ఒక సెషన్ కూడా కాదు, ఒక ఓవర్ కూడా కాదు. ఎరుపు బంతితో, మీరు మీ దృష్టిలో, మీరు ఆడే ప్రతి ఆట, మీరు ఆడే ప్రతి బంతి, మీరు క్రీజులో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలో ఖచ్చితంగా వ్యవహారించాలి. మా ప్రైమరీ ఫోకస్ అంతా రేపటి టెస్టు మ్యాచ్‌పైనే. పింక్-బాల్ టెస్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు, నేను చెప్పినట్లుగా సంతోషిస్తాం" అని కోహ్లీ తెలిపాడు.

Story first published: Wednesday, November 13, 2019, 19:12 [IST]
Other articles published on Nov 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X